భారత్, చైనా మధ్య మరోమారు సరిహద్దు ఉద్రిక్తతలు చెలరేగాయి. లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అంటున్నారు. కాగా ఈ దాడిలో మన భారత సైన్యంలో ఇరవై మంది అమరులయ్యారు. కాగా తాజా ఘటనతో... సరిహద్దుల్లో ఘర్షణపూరిత వాతావరణ నెలకొంది. నిజానికి గత కొన్ని వారాలుగా లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఈ దాడిలో బీహార్‌లోని భోజ్‌పూర్‌కు చెందిన కుందన్ ఓఝూ అనే సైనికుడు అమరుడయ్యాడు. అతని మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

IHG

ఈ మద్య కుందన్ ఓఝూ కి ఓ పాప పుట్టింది.. ఆ పాపను చూడకుండానే ఆయన అమరుడయ్యాడు. దాంతో కుందన్ ఓఝూ కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.  పహర్‌పూర్ గ్రామానికి చెందిన కుందన్ ఓఝా(28) పదేళ్ల క్రితం భారత సైన్యంలో చేరాడు.  రైతు కుటుంబంలో పుట్టిన అతడు అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో పని చేశాడు.

IHG

రెండు సంవత్సరాల క్రితం ఓఝా కి పెళ్లైంది.. అయితే ఓఝా భార్యకు 20 రోజలు క్రితమే పండంటి పాప పుట్టింది.  తనకు పాప పుట్టిందని ఎంతో సంతోషంలో ఉన్నాడ.. త్వరలో తన కూతుర్ని చూసుకోవడానికి వస్తానని ఓఝా అన్నారు. అంతలోనే సరిహద్దుల్లో జరిగిన దాడిలో అతని మరణ వార్త విని తట్టుకోలేకపోతున్నారు. కనీసం కూతురును ఒక్కసారిగా కూడా తాకలేదని అతని భార్య విలపిస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: