భారత దేశంలో కరోనా మహమ్మారి వల్ల ఎన్ని కష్టాలు వచ్చి పడతున్నాయో అందరికీ తెలిసిందే. దాదాపు మూడు నెలలుగా కరోనా వైరస్ దేశంలోప్రబలిపోతూ వస్తుంది. ఎన్ని జాగ్రత చర్యలు తీసుకున్నా.. లాక్ డౌన్ పాటించినా..  కరోనా వైరస్‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 12,881 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 334 మంది మరణించారు.  ఇక కరోనా కష్టాలు తీర్చేందుకు కేంద్రం సరికొత్త ఆలోచన చేసింది. భారత్ లో తొలి మొబైల్ కరోనా పరీక్షల వాహనాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు.

IHG

దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు చేసేందుకు ఈ మొబైల్ టెస్టింగ్ సెంటర్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని మంత్రి అన్నారు. దీని ద్వారా ప్రతిరోజూ 25 ఆర్టీ పీసీఆర్ టెస్టులు, 300 ఎలీసా టెస్టులు చేయడమే కాకుండా, హెచ్ఐవీ, టీబీ పరీక్షలు కూడా చేసే వీలుంది. ఫిబ్రవరిలో భారత్ లో కరోనాతో పోరాటం మొదలైందని, అప్పుడు దేశంలో ఒకే ఒక్క కరోనా పరీక్షల కేంద్రం ఉందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా 953 ఉన్నాయని మంత్రి వెల్లడించారు.

IHG

అందులో 699 ప్రభుత్వ ల్యాబ్ లేనని తెలిపారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,66,946కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం  12,237కి పెరిగింది. 1,60,384 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,94,325 మంది కోలుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: