చైనా కుటిన నీతి, కపట వేశాలకు 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. తొలుత కల్నల్‌ సహా.. మరో ఇద్దరు జవాన్లు మరణించారని అనుకున్నా.. ఆ తర్వాత మొత్తం 20 మంది వరకు భారత జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. దాంతో భారతీయులు ఒక్కసారిగీ రగిలిపోయారు.  ఒకప్పుడు దేశంలో స్వదేశీ వస్తువుల తయారీకి మద్దతిచ్చే జనం అప్పుడప్పుడు చైనా వస్తువులను బహిష్కరించాలంటూ పిలుపునిస్తూ ఉండేవారు. కానీ చైనాకి చెందిన లేదా చైనా మద్దతిస్తున్న మొబైల్ అప్లికేషన్లను జనం పెద్ద ఎత్తున డిలీట్ చేస్తూ ఉండటం సరికొత్త పరిణామం. 

 

లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో జరిగిన భారత్‌, చైనా సైనికుల ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్ల వీరమరణంపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బీహార్‌ రాజధాని పాట్నాలో జన్‌ అధికార్‌ పార్టీ అధినేత పప్పు యాదవ్‌ గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు.  అంతే కాదు  జేసీబీ ఎక్కిన ఆయన ఆ సంస్థ పేరుపై నల్లరంగు పూశారు. చైనా వస్తువులను వాడవద్దని, వాటిని బహిష్కరించాలంటూ నినాదాలు చేశారు.

 

టిక్ టాక్, పబ్‌జి మొబైల్, షేర్ ఇట్, జెండర్, కామ్ స్కానర్, బ్యూటీ ప్లస్, క్లాష్ ఆఫ్ క్లాన్స్, లైకీ, యూసీ బ్రౌజర్ వంటి చైనాకు సంబంధించిన అప్లికేషన్లను ఆ యాప్ లను బహిష్కరించాలాని కంకణం కట్టుకుంటున్నారు.  ఇక చైనా వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో గురువారం లైవ్‌ స్ట్రీమ్‌లో భారత్‌లో ప్రారంభించాల్సిన ప్రతిష్ఠాత్మక 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణను ఒప్పొ రద్దు చేసుకున్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: