ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఏ స్థాయిలో సంచలనం సృష్టించింది అనే విషయం అందరికి తెలిసిందే. ఆయన విషయంలో ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద కూడా చాలా రకాలుగా అనేక చర్చలు జరుగుతూ వచ్చాయి. పార్టీలో ఆయనకు బలమైన నేతగా ఉన్నారు కూడా. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయనకు సౌమ్యుడి గా కూడా పేరు ఉంది. అయితే ఆయ‌న ముక్కు సూటి త‌నం.. చిన్న చిన్న విష‌యాల‌కు కూడా మాట తూలిపోవ‌డం ఆయ‌న‌కు పెద్ద మైన‌స్‌గా మారింది. 

 

నిన్న సిఎం జగన్ ని ఎమ్మెల్యేలు కలిసిన సందర్భంగా ఆయన వద్ద రఘు వ్యవహారాన్ని ప్రస్తావించారు. దీనిపై సిఎం జగన్ కూడా ఎక్కడా ఆవేశ పడకుండా ఆయన విషయంలో స్పందించారు అని సమాచారం. ఇక ఆయనను కలవడానికి సిఎం సమయం లేక కలవడం లేదు అనే వార్తలు కూడా జగన్ వద్దకు వెళ్ళాయి. దీనితో త్వరలోనే తాను రఘు ని పిలిచి మాట్లాడతా అని ఆయన చెప్పారట. 

 

సిఎం ని కలిసి వచ్చిన అనంతరం కాస్త దూకుడుగా ఎమ్మెల్యేలు మంత్రులు వ్యాఖ్యలు చేసారు. దీంతో ఇప్పుడు ఆయన కూడా అదే స్థాయిలో స్పందించారు. ఈ నేపధ్యంలో పార్టీ అగ్ర నేత మంత్రి పెద్దిరెడ్డి ని జగన్ రంగంలోకి దించారు. ఇప్పటికే ఆయనను అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే హైదరాబాద్ వెళ్లి రఘు తో మాట్లాడాలి అని సూచించారట జగన్. ఇక న‌ర‌సాపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు అందరితో కూడా ఆయనను కూర్చోబెట్టాలి అని ఆదేశాలు ఇచ్చారట.

 

ఈ క్ర‌మంలోనే అధిష్టానం నుంచి ర‌ఘుకు బుజ్జ‌గింపులు వెళ్ల‌డంతో పాటు త్వ‌ర‌లోనే జ‌గ‌న్‌ను క‌లిసే ఏర్పాట్లు చేస్తామ‌ని హామీ ఇవ్వ‌డంతో ఆయ‌న కాస్త ప్ర‌స్తుతానికి శాంతిచిన‌ట్టు టాక్‌..?

మరింత సమాచారం తెలుసుకోండి: