కర్నల్ సంతోష్.. తెలుగు జాతి గర్వపడే పేరు.. దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలు వదిలిన మన తెలుగు తేజం.. తెలంగాణ ముద్దుబిడ్డ.. ఆయన పార్థివ దేహం.. అంత్యక్రియల కోసం సూర్యాపేటలో కదిలితే.. జనం పూలు చల్లారు.. మేడలపై నుంచి మిద్దెల పై నుంచి పుష్ప వర్షం కురిపించారు. జోహార్ సంతోష్.. అంటూ నినదించారు. జైజైవాన్ అంటూ గొంతెత్తారు.

 

 

ఇదే చైనా దాడిలో మరణించిన ఓ సైనికుడి అంత్యక్రియల కోసం చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి హాజరయ్యారు.. స్వయంగా పార్ధివ దేహాన్ని తన భుజాలపై మోసారు. సంతోష్ పార్థివ దేహం హకీంపేట కు రాగానే.. గవర్నర్ తమిళిసై నివాళులు అర్పించింది. జోహార్ సంతోష్ అంటూ నినదించింది. మరి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏమైంది..?

 

 

ఆయన కనీసం సంతోష్ పార్థివ దేహాన్ని సందర్శించలేదు. నివాళులు అర్పించలేదు.. ఆయన తల్లిదండ్రులను ఓదార్చలేదు... అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ.. సీఎం కేసీఆర్ కు అలాంటి అలవాటు లేదు అనుకుందామా.. అలాంటిదేమీ లేదే.. గతంలో హరికృష్ణ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు... స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారే.. కొన్ని వివాహాలకు తెలంగాణ దాటి మరీ ఆంధ్రాలో అడుగు పెట్టి మరీ ఆశ్వీరదించారే.. మరి ఇప్పుడు ఏమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

 

 

తెలంగాణ ముద్దుబిడ్డగా సంతోష్ త్యాగాన్ని ఎంతగా గుర్తుంచుకోవాలి.. తెలంగాణ తరపున దేశానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టిన అమరవీరుణ్ణి ఎంతగా స్మరించుకోవాలి.. మరి ఎందుకు కేసీఆర్ ఈ విషయంలో పట్టనట్టు ఉండిపోయారు. పోనీ.. అంతగా బిజీ షెడ్యూలు కూడా ఏమీ లేదు కదా.. అంతగా బిజీ అయితే తన పుత్రరత్నం కేటీఆర్ ను అయినా సూర్యాపేట పంపి ఉండవచ్చుకదా.. ఇలాంటి అమరవీరులను గౌరవించుకుంటేనే కదా.. తెలంగాణకూ గౌరవం.. అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: