సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడం ఒక సంప్రదాయం గా మారిపోయింది. చాలా మంది అగ్ర కదా నాయకులు ఒక దశలో రాజకీయాల్లోకి వచ్చి చరిత్రను సృష్టించిన సందర్భాలు ఉన్నాయి , అలాగే సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చి ఉన్న ఇమేజ్ ను కాస్త కోల్పోయిన నటులు కూడా ఉన్నారు. అయితే తాజా గా తమిళనాడు రాజకీయాల్లోకి మరో టాప్ హీరో రాబోతున్నట్టు తమిళ  రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.తమిళ నాడు లో ఇప్పటికే పలువురు నటులు రాజకీయాల్లోకి వచ్చారు. తాజాగా తమిళ దళపతి   నటుడు విజయ్‌ కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్టు సమాచారం. అయితే తన పుట్టినరోజు సందర్భంగా రాజకీయంగా ప్రవేశం గురించి ప్రకటించానున్నారా? ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 


సాధారణంగా విజయ పుట్టినరోజు ను అభిమానులు ఓ పండుగలా జరుపుకుంటారు.  ప్రస్తుత కరోనా కాలంలో తన పుట్టిన రోజు వేడుకలను ఎవరూ నిర్వహించవద్దని విజయ్‌ ఇప్పటికే తన అభిమానులకు ఒక ప్రయోగం ద్వారా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్‌ అభిమానులు కొందరు ఆయన పుట్టిన రోజు భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంతా వీర అభిమానులే అక్కడ ఉన్నారు. మీరంతా ఇప్పుడు మదురై జిల్లాలో విజయ్‌ పుట్టినరోజును పురస్కరించుకొని పోస్టర్లను విడుదల చేశారు. ఆ పోస్టులు ఇప్పుడు మధురై లోని వాడవాడలా గోడలపై హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ పోస్టులపై మోటు శివాజీ గణేషన్, కమల్‌ హాసన్‌ పక్కనే విజయ్‌ ఫొటోను ముద్రించారు. నిజానికి విజయ్‌ రజనీకాంత్‌ వీరాభిమాని . అలాంటిది ఆ పోస్టర్లో రజనీకాంత్‌ ఫోటో లేక పోవడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా నటుడు విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి వెల్లడిస్తారని, ఇంత కాలంగా మౌనం పాటిస్తున్న కొన్ని విషయాలను బద్ధలు కొట్టనున్నారని సమాచారం. అయితే దీనిపై నటుడు విజయ్ ఇప్పటికి స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: