ఈ మద్య ఏపిలో రాజకీయాలు గరం గరంగా కొనసాగుతున్నాయి.  అధికార, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది.  నేడు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇరుపక్ష నేతలు.  తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. నలభై ఏళ్ల రాజకీయం అంటారు చంద్రబాబు నాయుడు కానీ ఆయన రాజకీయాలు ఇప్పుడు ఎక్కడా పని చేయడం లేదని అన్నారు. ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రజలు విసిగిపోయారు.. అందుకే గత ఎన్నికల్లో దారుణంగా 23 మందిని ఆయన చేతుల్లో పెట్టారు.

 

రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం లేకున్నప్పటికీ దళితుడైన వర్ల రామయ్యను బరిలోకి దించారని మండిపడ్డారు. తన రాజకీయాల కోసం వర్ల రామయ్యను బలిపశువును చేశారని విమర్శించారు.  అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రజల గురించి ఆలోచించడం మానసేసి కుటిల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు క్యాష్ ముఖ్యమని భావించిన చంద్రబాబు... ఇప్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పారు.

 

రాజ్యసభ సీటును గెలిచే అవకాశం ఉంటే క్యాష్ ను చూస్తారని ... లేనప్పుడు క్యాస్ట్ ను చూస్తారని దుయ్యబట్టారు. రాజ్యసభ టికెట్ ను దళితులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ జగన్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని... అన్ని కులాలకు న్యాయం చేసింది జగన్ మాత్రమేనని రోజా అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్న మాట మీద నిలబడుతున్నారని.. ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్ దని చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: