ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండగా బ్రెజిల్ తరువాత స్థానంలో ఉంది. బ్రెజిల్ దేశంలో కేసుల సంఖ్య ఇంకా పెరగాలని, బ్రెజిల్ నాశనమైపోవాలని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బ్రెజిల్ పై భారతీయులు ఈ స్థాయిలో ఆగ్రహం చేయటానికి బలమైన కారణమే ఉంది. 
 
కొన్నేళ్ల క్రితం తీవ్ర కరువు, దుర్భిక్షంతో బ్రెజిల్ అల్లాడిపోయింది. అలాంటి సమయంలో అమెరికా బ్రెజిల్ కు ఎలాంటి సహాయసహకారాలు అందించకపోయినా భారత్ మాత్రం బ్రెజిల్ కు ఎంతో మేలు చేసింది. బ్రెజిల్ దేశానికి గిర్ జాతి వీర్యం, అండాలు, పిండాలను మనం ఎగుమతి చేశాం. వీటి వల్ల అక్కడ పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఆ తరువాత వ్యవయసాయపరంగా, పారిశ్రామికపరంగా బ్రెజిల్ ఎదిగింది. 
 
బ్రెజిల్ లో ప్రస్తుతం 80 శాతం పాలు గిరోలాండి జాతి ఆవుల నుంచి వస్తున్నాయి. గిర్, హోలిస్టీన్‌ల కలయిక ద్వారా గిరోలాండో జాతి ఏర్పడింది. గిర్ జాతి ఆవుల వల్ల బ్రెజిల్ లో భారీ స్థాయిలో పాల వ్యాపారం జరుగుతోంది. మినాస్ జెరాయిస్ రాష్ట్రంలోని పశువుల షెడ్డులో దాదాపు 3000 గిర్ జాతి ఆవులు ఉన్నాయని తెలుస్తోంది. ఒక్కో ఆవు సగటున రోజుకు 60 లీటర్ల పాలు ఇస్తోంది. 
 
కొన్ని ఆవులు దాదాపు 20 ఏళ్ల వరకు దూడలకు జన్మను ఇవ్వగలవని తెలుస్తోంది. బ్రెజిల్ కు ఎద్దుల ఆవుల అండాలు, వీర్యం ఇచ్చిన మన దేశం మాత్రం వాటిని వినియోగించలేకపోయింది. అనంతరం మన భారత ప్రభుత్వం బ్రెజిల్ ను అండాలు, వీర్యం కావాలని కోరినా బ్రెజిల్ ఇవ్వలేదు. మనం ఇచ్చిన వాటితో ఎదిగిన బ్రెజిల్ మనం సహాయం కోరితే మాత్రం ఇవ్వబోమని తేల్చి చెప్పింది. దీంతో అప్పటినుంచి భారత ప్రజలు బ్రెజిల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: