ఏ నాయకుడైన తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి గొప్ప పొజిషన్‌లో చూడాలనుకోవడం సహజమే. రాజకీయాల్లో తమని మించి ఎదగాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగా వారి ఎదుగుదలకు కృషి చేస్తారు. అయితే వారసుడుని రాజకీయాల్లోకి తీసుకొచ్చి, గొప్ప పొజిషన్‌లో చూడాలనే దానికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏమి అతీతంగా లేరు. అందుకే తన తనయుడు లోకేష్‌ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి, తన ఎదుగుదల కోసం పాటు పడుతున్నారు.

 

అయితే కొడుకు రాజకీయాల్లో రాణించాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదుగానీ...అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకుకి అడ్డదారిలో పదవులు కట్టబెట్టడం తప్పు. చంద్రబాబు కూడా అదే తప్పు చేశారు. లోకేష్‌ని డైరక్ట్‌గా ప్రజల నుంచి ఎన్నుకోకుండా ఇన్‌డైరక్ట్‌గా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, దానితో పాటు మంత్రిని చేసి రాజకీయం నడిపించారు. ఇలా ఇలా చేయడంలో వల్ల ఏమి జరిగిందో 2019 ఎన్నికల్లో తెలిసిపోయింది. లోకేష్ పరిస్తితి ఏమైందో కూడా తెలిసిందే.

 

కాకపోతే లోకేష్ ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఉండటంతో మండలికి వెళుతున్నారు. ఇక ఇదే ఇప్పుడు వైసీపీ నేతలకు అస్త్రం అవుతుంది. ఒకవేళ లోకేష్ ఏదైనా విమర్శలు చేసినా...వైసీపీ నేతలు వెంటనే కౌంటర్ ఇచ్చేస్తున్నారు. ప్రజల్లో నిలబడి గెలిచే దమ్ములేక దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారని విమర్శలు చేస్తున్నారు.  తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇలాగే మాట్లాడారు. విజయసాయి ఇలా మాట్లాడిన వెంటనే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న లైన్లోకి వచ్చేసి.. లోకేష్ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారా? మరి నువ్వు రాజమార్గంలో రాజ్యసభకు వెళ్లావా?’ అంటూ విజయసాయిపై విరుచుకుపడ్డారు. శాసనసభలోకి నారా లోకేష్ వెళ్లాలా వద్దా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారని, ఏదేమైనా దేవుడి స్క్రిప్ట్ ప్రకారం దొంగబ్బాయ్ పర్మనెంట్‌గా జైలుకు వెళ్లటం ఖాయమని అన్నారు.

 

అంటే ఇక్కడ లోకేష్, విజయసాయి ఒకేవిధంగా పదవులు పొందారనే అర్ధం వచ్చేలా వెంకన్న మాట్లాడారని తెలుస్తోంది. కానీ ఇద్దరి మధ్య చాలా తేడా ఉంది. విజయసాయి రాజ్యసభ సభ్యుడైన సరే...ఆయన పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. వ్యూహాలు రచించి టీడీపీకి చెక్ పెట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ భారీగా సీట్లు తెచ్చుకోవడంలో విజయసాయి పాత్ర చాలానే ఉంది. కానీ లోకేష్ వల్ల టీడీపీకి చాలా అంటే చాలా డ్యామేజ్ జరిగింది. ఆ విషయం ఎన్నికల్లో క్లియర్ గానే అర్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: