నేడు సంపూర్ణ సూర్య గ్రహణం.. ఈరోజు ఏర్పడే గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక , ఆఫ్రికా మొదలైన ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. ఈ దేశాల్లో సంపూర్ణంగా కనిపిస్తుండగా.. చాలా ప్రాంతాల్లో పాక్షికంగా కూడా కనిపిస్తుంది. ఇక మన ఇండియాలో డెహ్రాడూన్సూర్య గ్రహణాన్ని సంపూర్ణంగా చూడవచ్చు.

 

 

అయితే చాలా మందికి గ్రహణం సమయంలో ఏంచేయాలి.. ఏం చేయకూడదు అనే అంశాలపై అపోహలు ఉంటాయి. గ్రహణాన్ని మూఢ నమ్మకం అని కొట్టిపారేయకుండా.. కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది. గ్రహణం ప్రారంభం అయ్యే సమయానికి అరగంట ముందు స్నానం చేస్తే మంచిది. ఆ తర్వాత మీకు ఇష్టమైన స్తోత్రం గానీ, దేవుడి శ్లోకాలు గానీ చదువు కోవాలి.

 

 

మీరు నిత్యం జపించే మంత్రం జపిస్తే ఇంకా మంచిది. అయితే ఈ శ్లోకాలు గ్రహణం విడుపు సమయానికి ముగించేయాలి. ఇలా గ్రహణ కాలంలో జపం పదిరెట్ల ఫలితాన్నిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఇక ఈ సమయంలో ఇచ్చే దానాలు కూడా రెట్టింపు ఫలితాలనిస్తాయట..


అలాగే గ్రహణ సమయానికి ముందే ఆహారం తీసుకుంటే మంచిది. గ్రహణం వీడిన తర్వాత మరల స్నానం, జపం చేసి ఆహారం తీసుకోవచ్చు. ఇదే సమయంలో గ్రహణం పేరుతో మూఢ నమ్మకాలను ప్రోత్సహించకూడదు. అలాగని విచ్చలవిడి తనమూ పనికిరాదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: