చాలా సంవత్సరాల తరువాత ఆపరేషన్ చెకర్ బోర్డ్ అనే పదం మరోసారి వెలుగులోకి వచ్చింది. 1975 లో చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించిన సమయంలో భారత సైన్యం సిద్ధంగా ఉందనే సంకేతం ఇవ్వడానికి ఆపరేషన్ చెకర్ బోర్డ్ పేరుతో భారత్ సైనిక విన్యాసాలు చేసింది. ప్రస్తుతం యుద్ధవిమానాల మోహరింపుతో 4000 కిలోమీటర్ల మేర మిరాజ్ 2000 సుకోయ్ 30 యుద్ధవిమానాలు నిన్నటినుంచి చక్కర్లు కొడుతున్నాయి. 
 
అరుణాచల్ ప్రదేశ్ లో భారత్ యుద్ధవిమానాల దెబ్బకు ఆ ప్రాంతంలో చైనాకు సంబంధించిన సైనికులు వెనక్కు వెళ్లారు. గాల్వాన్ లోయలో కూడా విమానాలు, హెలికాఫ్టర్లతో పాటు వందల సంఖ్యలో సైన్యం దిగుతోంది. అక్కడ క్షిపణులు కూడా మోహరించారని తాజాగా సమాచారం అందుతోంది. దీంతో చైనా టిబెట్ వైపున విన్యాసాలు చేస్తోంది. ఆపరేషన్ చెకర్ బోర్డ్ పేరుతో 1975 లో భారత్ చైనా దేశాల సైన్యాలు ఎదురెదురుగా నిలిచాయి. 
 
అదే సమయంలో జనరల్ సుందర్జీ ఆపరేషన్ చెకర్ బోర్డ్ పేరుతో సైనిక విన్యాసాలను ప్రారంభించారు. భారత్ కు చెందిన 10 డివిజన్లు, వాయుసేన ఇందులో పాల్గొన్నాయని తెలుస్తోంది. ఆ సమయంలో చైనా సైన్యం సమ్ దురాంగ్ ప్రాంతం నుంచి వెనక్కు వెళ్లింది. ఆపరేషన్ చెకర్ బోర్డ్ ద్వారా యుద్ధానికి చైనా సిద్ధమైతే భారత్ కూడా సిద్ధమేనని చెబుతోంది. చైనా గాల్వన్ లోయ అంతా తనదే అని చెబుతూ ఉండటంతో చైనా మన సరిహద్దుల దగ్గరకు వస్తే యుద్ధానికి సిద్ధమంటూ భారత్ సంకేతాలు పంపుతోంది. 
 
ప్రధాని ఆపరేషన్ చెకర్ బోర్డ్ స్ట్రాటజీని ఫాలో అవుతూ చైనా దేశానికి భారీ షాక్ ఇచ్చారు. దీంతో చైనా లోయకు ముందే ఆగుతుందా....? లోయను కబ్జా చేయాలని ప్రయత్నిస్తుందా...? చూడాల్సి ఉంది. చెకర్ బోర్డ్ ద్వారా చైనాకు యుద్ధానికి సిద్ధమని పిలుపునివ్వడంతో చైనా ఏం చేయబోతుందో చూడాల్సి ఉంది. గతంలో ఆపరేషన్ చెకర్ బోర్డ్ ద్వారా భారత్ చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారటంతో దీని వల్ల సమస్య పరిష్కారమవుతుందని మోదీ సర్కార్ భావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: