కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని సైతం వణికిస్తోంది. ప్రపంచంలో కరోనా నివారణ చెయ్యడానికి అనేక రకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అదే తరహాలో చార్జింగ్ మాస్క్  పేరుతో ఓ వినూత్న ప్రయోగం మార్కెట్లోకి వచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే మిగిలిన మాస్క్ లలో వైరస్ శ్వాసక్రియలోకి ,నోటిలోకి వెళ్లకుండా అడ్డు పడే ఒక మమ్ములూ గుడ్డ లా పని చేస్తుంది.

 

ఈ గుడ్డ మాస్క్ ను వాడిన తరువాత వేడి నీటిలో కడిగి ఎండ లో ఆరపెట్టలి. కొంత మంది ఈ వాడిన మాస్క్ ను డెటాల్ నీటిలో నానబెట్టి అప్పుడు ఉతకాలని సూచిస్తుంటారు.ఈ విధంగా చెయ్యక పోతే మాస్క్ ధరించి బైటికి వెళ్ళినప్పుడు మాస్క్ మీదకు వచ్చిన వైరస్ మాస్క్ కు అంటుకొని ఉండిపోతుంది.

 

కానీ ఇప్పుడు ఆ వైరస్ ను ఛార్జింగ్ మాస్క్ తో చంపొచ్చని  ఇజ్రాయెల్ పరిశోధకులు  అంటున్నారు.మాస్క్ కు ఫోన్ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ పెట్టినప్పుడు మాస్క్ వేడి చెంది కరోనావైరస్ చనిపోతుందని అంటున్నారు. హైఫాలోని టెక్నియన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక బృందం యూఎస్‌బి పోర్టుతో ఉండే మాస్కును తయారుచేసింది. ఆ పోర్టుకు మొబైల్ ఫోన్ ఛార్జర్‌ను జోడించి 30 నిమిషాలు ఛార్జింగ్ పెడితే ఆ వేడికి మాస్కులోని క్రిములన్నీ చనిపోతాయి అంటున్నారు. ఛార్జర్ మాస్కులోని కార్బన్ ఫైబర్స్  పొరను 70 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తుంది.

 

ఇలాంటి కొత్త ఆవిష్కరణలు ప్రతిసారి కొత్తగా వచ్చిన వాటికి నియంత్రణ అనే ఒక మాట తో మార్కెట్లోకి విడుదల అవుతూ ఉంటాయి. ప్రజల జాగ్రత్తలకు ఇవి ప్రతిబింబాలు. కరోనా తో పాటు జీవించాలి అని ఎందరో ప్రముఖులు పలుమార్లు చెప్పారు. ఇలాంటి సందర్భాలలో ఏవిధంగా ఉపయోగపడే ఆవిష్కరణలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇటువంటి వలన సామాజిక దూరం పాటిస్తూ, కొత్త వెర్షన్ కూడా దరిచేరకుండా వాటి మనుగడ ను ఆపే విధంగా ఇవి పని చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: