ఆడపిల్లలకు కేవలం బయట సమాజంలోనే కాదు తల్లి గర్భంలోను స్వేచ్ఛ లేదని చాలా రోజులనుంచి వింటూనే ఉన్నాం. ఇంతకు ముందు రోజుల్లో పుట్టేది ఆడపిల్ల అని తెలిస్తే ఏమి ఆలోచించకుండా తల్లి గర్భంలోనే ఆ పిండాన్ని నాశనం చేసేవారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఈ పరిస్థితి కాస్త మారింది. పుట్టబోయేది ఎవరైనా సరే సంతోషంగా తల్లిదండ్రులు వారిని పెంచి పెద్ద చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. తల్లి తన కన్నబిడ్డనే హత్య చేసింది. కేవలం తల్లి మాత్రమే కాకుండా అత్తయ్య, అమ్మమ్మ కూడా తోడవడంతో సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చింది.

 


అసలు విషయంలోకి వెళితే... జిల్లాలోని కొత్తూరు లో ఓ కుటుంబానికి చెందిన మహిళ ఇటీవల ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. వంశపారపర్యంగా మూడు తరాలుగా ఆడపిల్లలు పుట్టడంతో ఆడపిల్ల పుట్టడంతో తల్లి పుట్టింటివారు ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. అయితే ఈ విషయాన్ని మగవారికి తెలియకుండా ఆ పసికందును హతమార్చాలని సదరు మహిళలే హత్యకు కుట్ర పన్నారు. పది రోజులుగా ఎన్నో కుట్రలు వేసిన చంపే ప్రయత్నం మాత్రం చేయలేదు. బిడ్డకు 21 రోజు సమీపిస్తున్న సమయంలో ఉయ్యాలలో వేసి కార్యక్రమం చేయాలన్నా బెంగ వారిలో క్రమక్రమంగా మొదలైంది. ఇక దాంతో శుక్రవారం ఉదయం తెల్లవారుజామున ఆ చంటి బిడ్డని తీసుకువెళ్లి బిడ్డ తల్లి, అమ్మమ్మ, తాతమ్మ ఇంటి పక్కనే ఉండే పాడుబడ్డ బావిలోకి వారందరూ కలిసి పసికందును విసిరేశారు.

 


అయితే ఆ తర్వాత తిరిగి వచ్చిన మహిళలు... తెల్లవారాక బిడ్డను ఎవరో ఎత్తుకు పోయారని ఇంట్లో మగవారికి చెప్పి, బాలిక కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. పసికందును తన తల్లి అమ్మమ్మ తాత అమ్మ చంపేశారు అనే విషయం తెలియడంతో వారు ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. ఇకపోతే పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు వారందరూ అంగీకరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: