మద్యం పానం ఆరోగ్యానికి హానికరం.. ఈ మాట ఎక్కడ చూసిన వినిపిస్తుంది.. ఆల్కహాల్ తాగడం వల్ల చిన్న మెదడు పనిచేయదు. అంతేకాదు మద్యం వ్యసనం లాంటిది. ఈ తాగుడుకు ఒక్కసారి బానిసైతే, ఇంకా జీవితంలో ఎప్పుడు మద్యానికి దూరానికి కాలేరు. ఈ మద్యపానం వల్ల కుటుంబాల మధ్య చిచ్చు పెరగడమే కాదు జీవితాలు కూడా నాశనం చేసుకుంటున్నారు. 

 

 

ఒక పక్క ప్రభుత్వాలు మద్యపానం నిషేధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరో పక్క మందుబాబులు ఎవరు చెప్పిన మేము వినేది లేదు అంటూ రెచ్చి పోతున్నారు. అయితే ఓ గ్రామంలో మద్యం వ్యాపారి గ్రామ సర్పంచ్ ఎంత వద్దనుకున్నా కూడా వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. నెత్తినోరు మొత్తుకొని చెప్పిన అతను వినలేదు. డబ్బు పిచ్చిలో అక్రమ అమ్మకాలను చేస్తూ వచ్చాడు. అలాంటి వ్యాపారికి ఆ ఊరి సర్పంచ్ బుద్ది చెప్పింది. 

 

 


వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని సిర్పూర్ తాలూకా పింప్రి డుమారా అనే గ్రామంలో మద్యం విక్రయాలు ఇటీవలి కాలంలో పెరిగాయి. ఈ కారణంతో ఊళ్లో గొడవలు పెరిగాయి.తమ గ్రామంలో మద్యం అమ్మకాలు చేయవద్దంటున్నా, వినకుండా విక్రయాలు సాగిస్తున్న ఓ వ్యాపారిని, ఆ గ్రామ సర్పంచ్ తరిమి తరిమి కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది

 

 


ఈ విషయం పై సీరియస్ గా స్పందించిన సర్పంచ్ మనీషా కేద్కర్, మద్యం అమ్మే వ్యాపారికి బుద్ధి చెప్పాలని భావించింది. అనుకున్న వెంటనే ఓ కర్ర తీసుకుని అతనిపైకి లంఘించింది. మరోసారి గ్రామంలో లిక్కర్ అమ్ముతావా? అంటూ కర్రతో కొట్టింది. దీంతో మరోసారి గ్రామంలో అమ్మకాలు చేయబోనని వేడుకుంటూ అతను పరుగులు పెట్టాడు. ఆమె అతనికి భరిత పూజ చేస్తున్నప్పుడు ఎవరో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీరు ఓ లుక్ వేసుకోండి... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: