ఈ మధ్య కాలంలో రోజుకు ఏదో ఒకటి ప్రతేక్యత ఉంటున్నాయి. కానీ.. నేడు ఒక్క రోజే 7 ప్రత్యేకమైన దినోత్సవాలు నిర్వహించుకోనున్నారు. అలాగే సూర్యగ్రహణం కూడా వచ్చింది. ఆ ఏడు ప్రత్యేకమైన దినోత్సవాలు ఏంటో ఒక్కసారి చూద్దమామరి ...


ప్రపంచ యోగా దినోత్సవం..

 

2015లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన తర్వాత నుండి ప్రతి సంవత్సరం జూన్‌ 21న ఇంటర్నేషనల్‌ యోగా డేగా చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస) నిర్ణయం తీసుకుంది. ఓ సంవత్సర కాలంలో మొత్తం మీద పగటి పూట ఎక్కువగా ఉండే జూన్‌ 20, 21, 22 తేదీల్లో మాత్రమే ఉంటుంది. ఈ మూడు రోజుల మధ్య రోజైన జూన్‌ 21 ని యోగా డేగా మోడీ ఎంపిక చేశారు. 


తండ్రుల దినోత్సవం (ఫాదర్స్‌ డే)..

 

నిజానికి ఫాదర్స్‌ డే అనేది ప్రతి సంవత్సరం జూన్‌ 3 ఆదివారం నాన్నల దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మూడో ఆదివారం జూన్‌ 21 న వచ్చింది. తండ్రిని గౌరవించుకునేందుకు ఈ ఫాదర్స్‌ డే ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. తండ్రి సంతోషాలను దిగమింగుకొని ఆయన కుటుంబం కోసం కష్టపడే నాన్న విలువను తలుచుకుంటూ తండ్రుల దినోత్సవాన్ని చేసుకుంటారు.

 

ప్రపంచ మానవతావాది దినోత్సవం ...

 

1980 సంవత్సరం నుంచి ప్రజల్లో మానవత్వాన్ని పెంచేలా మానవతావాది దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎన్నో దేశాల్లోని మానవ హక్కుల సంస్థలు ఈ దినోత్సవాన్ని జరుపుతాయి. ప్రపంచ వ్యాప్తంగా మానవత్వం పెంపొందించేందుకు స్ఫూర్తి అందించేది ఈరోజు.


హైడ్రోగ్రఫీ డే..

 

ప్రపంచంలోని జల వనరుల అభివృద్ధికి ప్రజలను కట్టుబడి ఉండేలా చేసేందుకు హైడ్రో గ్రఫీ డే 2005 జూన్‌ 21వ తేదీ నుంచి మొదలు పెట్టారు. ఐక్యరాజ్యసమితి కూడా దీన్ని గుర్తించి హైడ్రోగ్రఫీ అంటే జన వనరుల భౌతిక స్వరూపాల కొలమానాల విజ్ఞాన శాస్త్రం అని తెలియ చేసింది. నదుల చిత్రాలు, సరస్సులు, ఇతర జలాశయాలను అన్ని రంగాల అభివృద్ధికి హైడ్రోగ్రఫీ తొడపాటు అందించనుంది. 

 

సంగీత దినోత్సవం ..


ఫ్రాన్స్‌ రాజధాని పారిస్ నగరం‌లో 1982 లో మొదటిసారిగా ఇది ప్రారంభమైంది. ప్రస్తుతం 120 దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఫ్రాన్స్‌ సాంస్కృతిక మంత్రి జాక్‌ లాంగ్‌, అదే దేశానికి చెందిన సంగీత కళాకారుడు ఫ్లూ హెమోవిస్‌ ఈ మ్యూజిక్‌ రోజును ప్రారంభించారు. ఇకపోతే ఈ రోజున బహిరంగ ప్రదేశాల్లో తమ వాయిద్య పరికరాలతో మంచి సంగీతాన్ని వినిపిస్తుంటారు కళాకారులందరు. 

 

కరచాలన దినోత్సవం..


దీన్నే షేక్‌ హ్యాండ్‌ డే అని అంటారు. ఇకపోతే ఈ రోజు కరచాలనం దినోత్సవం కూడా... కానీ, ప్రస్తుతం కరోనా వైరస్ పుణ్యమా అని ఈ ఏడాది కరచాలనం దినోత్సవం జరగట్లేదు. దీనికి కారణం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి, అందుకే ఒకరికొకరు నమస్కరించుకోవడం ఉత్తమం.

 

టీ షర్ట్స్‌ దినోత్సవం..

 
టీ షర్ట్స్‌ డే వల్ల సమాజానికి ఎలాంటి అవసరం లేకపోయినా 2008లో ఓ జర్మనీ దుస్తుల సంస్థ దీన్ని మొదలు పెట్టింది. ఇక అప్పటి నుండి యువత దీన్ని ఎక్కువగా అనుసరిస్తున్నారు. జర్మనీ దేశంలోని ఫ్యాషన్‌ దుస్తుల ఉత్పత్తిదారులు వ్యాపారం కోసం టీ షర్ట్స్‌ డే ను ఏర్పాటు చేసారంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: