గతంలో భారతదేశం వస్త్రాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండేది. భారతీయులు పండించే పత్తి ధర క్వింఠాలు 4,000 రూపాయలకు అటూఇటుగా ఉంటే 2013లో చైనా క్వింఠాలుకు ఏడు వేల రూపాయలు చెల్లించి పంటను కొనుగోలు చేసింది. చైనా చేసిన ఆ పని వల్ల మన దేశం వస్త్ర పరిశ్రమకు పత్తి లభ్యం కాలేదు. అందువల్ల దేశంలోని వస్త్ర పరిశ్రమలు మూతబడ్డాయి. ఈ విధంగా చైనా ఏ దేశంలోనైనా ప్రవేశిస్తే ఆయా దేశాల వస్తువులు మార్కెట్ లో లేకుండా చేస్తోంది. 
 
సైకిళ్ల పరిశ్రమపై ఆధారపడి భారత్ లో లక్షల సంఖ్యలో కుటుంబాలు జీవనం సాగించేవి. సైకిళ్లకు సంబంధించిన అన్ని భాగాలు చైనా నుంచి దిగుమతి కావడం... అవి తక్కువ ధరకు లభించడం వల్ల పంజాబ్ లో వందల సంఖ్యలో సైకిళ్ల పరిశ్రమలు మూతబడ్డాయి. ఒక్క ఫిరోజాబాద్ లోనే 400 పరిశ్రమలు ఉండగా చివరకు 40 పరిశ్రమలు మిగిలాయి. భారత్ లోని బస్సులు, ట్రక్కులకు కావాల్సిన టైర్లు మన మార్కెట్లో చైనా డంపింగ్ చేసి వారంటీ లేకుండా తక్కువ ధరకు అమ్మడం వల్ల పంజాబ్ లో వందల సంఖ్యలో పరిశ్రమలు మూతబడ్డాయి. 
 
బ్లడ్ క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి రోగాలకు మందులు తయారు చేయడంలో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. అయితే చైనా నాసిరకం మందులను తయారు చేసి వాటిపై మేడ్ ఇన్ ఇండియా లేబుల్స్ అతికించి ఫార్మా రంగాన్ని దెబ్బ తీసింది. విటమిన్, ఫాలిక్ ఆసిడ్ తయారు చేసే పరిశ్రమలను మూసివేయించే పనిలో భాగంగా మొదట వాటిని మన కంటే తక్కువ రేటుకు అమ్మి మన పరిశ్రమలు మూతపడగానే వాటి రేటును పెంచింది. 
 
ఆఫ్రికన్ దేశాలలో పెట్టుబడులు పెట్టి ఆ దేశాలను ఆక్రమించే దిశగా చైనా ప్రయత్నాలు చేస్తోంది. మన సమీప దేశాలకు కూడా అధిక మొత్తంలో అప్పులు ఇచ్చి... ఆ దేశాలు చెల్లించని పక్షంలో చైనా భూములను ఆక్రమించే ప్రయత్నాలు చేస్తోంది. శ్రీలంక, లాటిన్ అమెరికా, బ్రెజిల్ దేశాలను కూడా చైనా నాశనం చేస్తోంది. మనుషులతో, మనుషుల అవయవాలతో కూడా చైనా వ్యాపారం చేస్తుండటం గమనార్హం. చైనా చేసిన పనుల వల్ల భారత్ కు కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం కలిగిందని చెప్పవచ్చు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: