దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి మనిషిని మనిషి తాకాలంటేనే భయపడిపోతున్నారు. అలాగే ఏదైనా వస్తువులు తాకాలన్న ముందుగా శానిటైజర్ అప్లై చేసి ఆ వస్తువులను తాకుతున్నారు.  భౌతిక దూరాన్ని పాటిస్తూ.. మాస్క్ లు ధరిస్తున్నారు. ఇవన్నీ కరోనా మనకు రాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు. ఇప్పటి వరకు కరోనా వైరస్ ని తగ్గించడానికి సరైన వ్యాక్సిన్ రాలేదన్న విషయం తెలిసిందే. తాజాగా ఎంతో పవిత్రంగా దైవ దర్శనం చేసుకోవాలని వచ్చినా.. ఇక్కడ కూడా తగు జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి నెలకొంటుంది. తాజాగా ఆటోమెటిగ్‌గా పని చేసే తీర్థ డిస్పెన్సర్ (తీర్థ పంపిణీ యంత్రం) ఆలయంలో ఏర్పాటు చేశారు.  కర్నాటకలోని మంగుళూరు ఆలయంలో ఏర్పాటు చేయడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

భక్తులు ఆ యంత్రం దగ్గరకు చెయ్యి పెట్టాలి. వెంటనే సెన్సార్లు  గుర్తించి తీర్థాన్ని చేతిలో యంత్రం పోస్తుంది. పూజారులతో పనిలేకుండా జరిగిపోతున్న ఆ పంపిణీ చూసి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలే కరోనా కష్టకాలంలో ఈ టైప్ తీర్థప్రసాదాల పంపిణీ ఎంతో బాగుందని... ఎవరికీ ఏ భయం లేకుండా ఉంటుందని అంటున్నారు భక్తులు. ఇలాంటి టెక్నాలజీలు త్వరలోనే అన్ని గుళ్లలోనూ అందుబాటులోకి రావాలని కోరుతున్నారు.

 

దీన్ని అసిస్టెంట్ ప్రోఫెసర్ సంతోష్ అనే వ్యక్తి తయారు చేశాడు. కాగా ఇప్పటికే ఆలయాల్లో గంటలు కొట్టొద్దని ఆదేశాలు ఉండటంతో సెన్సార్ టెక్నాలజీ ద్వారా గంటలు వాటికి అవే శబ్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, దేవాలయాల్లో పరిమిత భక్తులు.. కొన్ని నిబంధనల్లో భాగంగా ఇప్పటి వరకు గుడిలో గంటలు కొట్టడాలు, తీర్థం అందజేయడం నిలిపివేసిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: