అనేక దేశాల ఎకానమీని శాసిస్తున్న మాదకద్రవ్యాల బిజినెస్ అంతా ఇంతా కాదు... ఎంతోమంది ప్రజలు వీటి బారిన పడి సర్వసం కోల్పోతున్నారు. లాక్ డౌన్ లో సైతం మాదక ద్రవ్యాలు అధిక సంఖ్యలో లభించాయి. పోలీసులు చేస్తున్న కాటన్ సెర్చ్ లో భాగంగా ఎన్నోసార్లు ఎన్నో కోట్ల రూపాయల డ్రగ్స్ లభించాయి. తమిళనాడులోని మహాబలిపురం సముద్రతీరానికి భారీగా మాదక ద్రవ్యాలు కొట్టుకొచ్చాయి. వీటి విలువ సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స‌ముద్ర‌పు ఒడ్డున‌ ఓ డ్రమ్‌ లో చైనా భాషలో రాసి ఉన్న కవర్లను స్థానికులు గమనించారు .ఆ కవర్లలో టీ పొడి లాంటి పదార్థాలు  కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్క‌డికి చేరుకున్న పోలీసులు వాటిని ప‌రిశీలించ‌గా.. డ్ర‌గ్స్ అని తేలింది. ప్యాకెట్లలో ఉన్న పొడిని మెథా బయోటిన్‌ డ్రగ్‌ గా గుర్తించింది తమిళనాడు నార్కోటిక్‌ విభాగం.

 

 

డ్రగ్‌ డీలర్లు చైనా నుంచి వీటిని ఓడలలో తెచ్చి ఎవరికీ కనిపించకుండా డ్రమ్ములకి తాళ్లు కట్టి నీళ్లలోంచి బయటకు తీసి తీసుకెళ్తుండగా పడిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మహాబలిపురానికి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుండటంతో ఈ ప్రాంతంలో యథేచ్ఛగా డ్రగ్స్‌ ను విక్రయిస్తుంటారు. డ్రగ్స్‌ దొరికిన డ్రమ్ము ఎలా వచ్చిందన్న దాని మీద పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ విధంగా చేయడం ఇది రెండో సారి అని పోలీసు రికార్డుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సముద్రంలో అకస్మాత్తుగా ఏర్పడిన తుపాను వల్ల ఏదైనా ఓడ మునిగి వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు.

 

 

ఈ మాదక ద్రవ్యాల బారినపడి ఎన్నో కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి, ఇప్పటికి అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ సైతం దీని ఉచ్చులో చిక్కుకుపోయి ఉన్న పేరును సైతం పోగొడుతుంది. తెలుగు ఇండస్ట్రీ సైతం ఈ భారిన పడింది. ఎప్పటికప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మాదకద్రవ్యాల విషయంలో కేసు నమోదు చేసినప్పటికీ ఈ ముఠాను నియంత్రించలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: