ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో పసిపిల్లలను అమ్ముతున్న గ్యాంగ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మొత్తం ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ ఐదుగురు లో ఓ గర్భిణీ కూడా ఉంది. ఆ గర్భవతి సరోగసి ని మోస్తోంది. ఆ గ్యాంగ్ తో పాటు ముగ్గురు పసిపిల్లలను కూడా పోలీసులు కాపాడారు. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే లో వెళ్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఇకపోతే వారి బారి నుండి కాపాడిన పసిపిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించడం జరిగింది.

 


ఇక ఈ ముఠాలో నిందితులను నీలం, రాహుల్, అమిత్ కుమార్, ప్రదీప్ కుమార్, రూబీ లుగా గుర్తించడం జరిగింది. ఢిల్లీలోని హర్ష్ విహార్ లో  నీలం అనే వ్యక్తి, అలాగే సరోగసీ గర్భంతో ఉన్న మహిళ ఫరీదాబాద్ లో నివసిస్తూ ఉండేవారు. అంతేకాకుండా ప్రదీప్ కుమార్, అమిత్ కుమార్ కూడా ఫరీదాబాద్ కు చెందిన స్థానికులే. బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల నుంచి సరోగసీ కోసమని నేపాల్ దేశానికి మహిళలను వారు తీసుకు వెళ్లేవారు. అక్కడి ఆసుపత్రులు పిల్లలు లేని తల్లి దండ్రుల నుంచి ఏకంగా 9 నుంచి 10 లక్షల వరకు వసూలు చేసి అందులో మూడు లక్షలు సరోగసి మోసే అమ్మాయిలకు ఇచ్చేవారని ఎస్ పి కుమార్ తెలియజేశారు.

 

 

నేపాల్ దేశంలో ఈ వ్యాపారం మొత్తం అక్రమంగా జరుగుతున్నది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ గ్యాంగ్ ఫరిదాబాద్ చేరుకోగా అందులో భాగంగానే ఆగ్ర లక్నో ఎక్స్ ప్రెస్ వే మీద వెళ్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు. ఇకపోతే కారులో ఉన్న రూబి అనే మహిళ తన సరోగసి బిడ్డను వేరే గ్యాంగ్ కు ఇచ్చినట్లు చెబుతోంది. అంతేకాకుండా వారు తన బిడ్డని వేరే వారికి అప్ప చెబుతారని చెబుతోంది. ఇకపోతే వారితో పాటు లభించిన ముగ్గురు పిల్లలు ఎక్కడివారు చెప్పలేక పోవడంతో వారందరినీ అనుమానిస్తూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలోనే కొంత మంది అనుమానితులను పోలీసులు ఫాలో అయ్యి వారి ముఠా గుట్టు రట్టు చేసినట్లు ఎస్పీ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: