కరోనా వైరస్‌ సోకిన చాలా మందిలో తీవ్రమైన లక్షణాలు కనిపించవు. అసలు కొంత‌మందికి క‌రోనా సోకింద‌న్న విష‌యం కూడా తెలియ‌డం లేదు. చివ‌ర‌కు ప‌రిస్థితి కంట్రోల్ త‌ప్పి వారు చ‌నిపోవ‌డం కూడా జ‌రుగుతోంది. అస‌లు ఈ వ్యాధి ఉంద‌న్న విష‌యం తెలిసే లోపే చాలా మంది ప్రాణాలు కూడా పోతున్నాయి. అయితే క‌రోనా నుంచి కోలుకున్నాక త‌ర్వాత తిరిగి వారు సాధార‌ణ స్థితికి వ‌చ్చినా కూడా వారు కొన్ని ప్ర‌మాదాలు ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని నిపుణులు చెపుతున్నారు.

 

క‌రోనా నుంచి కోలుకున్న వారు సాధార‌ణ జీవితంలోకి వ‌చ్చిన‌ట్టు కాద‌ని వైద్య రంగ నిపుణులు చెపుతున్నారు. క‌రోనా నుంచి మ‌నుష్యులు కోలుకున్నా కూడా ఆ వైర‌స్ శ‌రీరంలోని మ‌నిషి అవ‌యవాల‌పై మాత్రం అలాగే ఉంటుంద‌ట‌. ఒక‌సారి వైర‌స్ సోకిన వ్య‌క్తి ఊపిరి తిత్తుల్లో ఏదో ఒక పార్టు ఖ‌చ్చితంగా దెబ్బ తింటుంద‌ని వీరు చెపుతున్నారు. బయటకు కరోనా నుంచి కోలుకున్నా వైరస్ ప్రభావిత కణాలు ఇంకా వారి శరీరంలో అలానే ఉంటాయట‌.

 

ప్రత్యేకించి కరోనా నుంచి కోలుకున్నా వారిలో ప్రధానంగా ఊపిరితిత్తుల మార్పిడి అవసరం ఉంటుందనే విషయం Antoinette తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేకాదు.. గుండెపోటు లేదా స్ట్రోక్  కూడా వచ్చే ముప్పు ఉందని తెలిపారు. ఒక‌సారి క‌రోనా సోకిన వ్య‌క్తిలో ర‌క్తం గ‌డ్డ క‌డుతుంద‌ట‌. ఒక వేళ ఊపిరితిత్తులు దెబ్బ‌తిన్నాక కూడా జీవితాంతం ఆక్సిజ‌న్ పై ఆధార ప‌డాల్సిన అవ‌స‌రం కూడా ఉంటుంద‌ని ఆమె చెపుతున్నారు. ఏదేమైనా క‌రోనా వ‌చ్చి త‌గ్గించుకోవ‌డం కంటే అస‌లు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా బెట‌ర్ అని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: