ఆలయ పూజారి అద్భుతం చేశాడు. మామూలుగా అందరూ కాళ్లతో ప్రదిక్షణలు లేదా అంగ ప్రదక్షణలు చేస్తారు. కానీ ఈ పూజారి మాత్రం చేతులతో ప్రదక్షిణ చేశారు. నిజానికి ఒక్కో వ్యక్తిలో ఒక టాలెంట్ ఇమిడి ఉంటుంది. అది వారి సమయం వచ్చినప్పుడు మాత్రమే బయటికి వస్తుంది. కాకపోతే ఇప్పుడు దేవుడు సన్నిధి లోనే ఉంటూ భగవంతుని నిత్య పూజలు చేస్తూ నిర్వహించే ఒక పూజారి తనలోని టాలెంట్ ని బయటపెట్టాడు.

 

IHG


ఇక అసలు విషయంలోకి వెళితే... కేదారనాథ్ ఆలయ పూజారి సంతోష్ త్రివేది కేదరనాథ్ ఆలయ గుడి చుట్టూ కొత్తరకంగా ప్రదక్షిణలు చేశారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆయన తన చేతులపై కేదరనాథ్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆయన తన చేతులతో తలకిందులుగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అందరిని ఆశ్చర్యచకితులను చేశారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ అది కేవలం యోగా సాధన ద్వారానే సాధ్యమైందని చెబుతున్నాడు.

 

IHG

 

మనమందరము మనసుపెట్టి యోగా చేస్తే చేతులతో నడవచ్చు, అలాగే నీటిలో తెలవచ్చు , గాలిలోనే కూర్చోవచ్చు అంటూ యోగ సాధకులు ఎప్పటి నుంచో మనకు చెబుతున్నారు. అయితే యోగ ద్వారానే మనసుకు, అలాగే శరీరానికి మంచి ఆరోగ్యం సమకూరుతుందని ఎంతోమంది యోగా గురువులు చెబుతూనే ఉన్నారు. ఇకపోతే కేదరనాథ్ ఆలయ పూజారి సంతోష్ త్రివేది చేతులతో చేసిన ఆలయ ప్రదక్షిణ కు సంబంధించి ఫోటోలు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: