నిర్మాణ వ్యవస్థ మన భారతదేశంలో అస్తవ్యస్తంగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే..! సాధారణ నిర్మాణాలు అయితే ఆస్తి నష్టం ఉంటుంది.. అదే నివాస ప్రాంతాలు అయితే ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా ఉంటుంది. అదే అలాంటిది శత్రు దేశ సరిహద్దుల్లో ఉన్న నిర్మాణం అయితే ఆస్తి నష్టం, ప్రాణ నష్టంతో పాటు దేశ రక్షణ నష్టం కూడా కలుగుతుంది. ఇప్పుడు సరిగ్గా అలాంటిదే భారత్-చైనా సరిహద్దుల్లో చోటు చేసుకుంది. సరిహద్దుల భాగంలో వంతెన కూలి పోయింది. ఇలాంటి సందర్భాల్లోనే శత్రు దేశాలకు లోకల్ అవుతాము.

 

ఉత్తరాఖండ్లోని భారత్​-చైనా సరిహద్దులో ఓ వంతెన కూలిపోయింది. భారీ నిర్మాణ యంత్రాన్ని తీసుకెళ్తున్న ఓ లారీ.. వంతెనను దాటుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఉత్తరాఖండ్​ పితోర్​గఢ్​ జిల్లాలో భారత్​- చైనా సరిహద్దులో ఓ వంతెన కూలిపోయింది. భారీ నిర్మాణ యంత్రాన్ని తీసుకెళ్తున్న లారీ... బ్రిడ్జ్​ దాటే సమయంలో ఒక్కసారిగా నెలకొరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. రాష్ట్రంలోని లిలాం జోహార్​ లోయలోని మున్సారీ తహసీల్ వద్ద ఉన్న ధపా మిలాం రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.


మిలాం నుంచి చైనా సరిహద్దు వరకు 65 కిలోమీటర్ల మోటారు మార్గాన్ని నిర్మించడానికి ఆ నిర్మాణ యంత్రాన్ని తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే, వంతెన కూలిపోవడం వల్ల సరిహద్దు ప్రాంత గ్రామాల్లోని 7000 మందికి పైగా ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్మీ, ఐటీబీపీ దళాల ప్రయాణాలకూ విఘాతం కలిగింది. యుద్ధ ప్రాతిపదికన తిరిగి వంతెన నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే గాల్వాన్ సమీపంలో 72 గంటల్లోనే ఓ వంతెన నిర్మించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అదేవిధంగా దీని నిర్మాణం కూడా పూర్తి చేస్తారని దేశ ప్రజలు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: