ప్ర‌పంచ మ‌హ‌మ్మారి కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు ఇంట్లోనే చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. కోవిడ్‌ను ఎదుర్కోవాలంటే ప్ర‌తి ఒక్క‌రు రోగ నిరోధ‌క వ‌క్తి పెంచుకుంటే చాలు. ఎవ‌రికి వారు రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పెంచుకునేందుకు ప్రయత్నించాలి. మనలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటే వైరస్‌లు, ఇతర వ్యాధులను కూడా సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పరిధిలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, కాయలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు సమృద్ధిగా దొరుకుతాయని వారు చెపుతున్నారు.

 

* తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా (ప్రతి వ్యక్తి రోజుకు 450 నుంచి 500 గ్రాముల వరకు) తినాలి. తృణధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. స్థానికంగా పండే ధాన్యాలు, ఆయా సీజన్లలో దొరికే పండ్లలో ఈ పోషకాలు లభిస్తాయి.

* అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి.

* ఈ సమయంలో కార్బోనేటేడ్ శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. వాటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్ లాంటి ముఖ్యమైన   పోషకాలు తక్కువగా ఉంటాయి.

 

* మాంసం, గుడ్లు తినడం ప్రమాదమేమీ కాదు. బాగా ఉడికించిన మాంసాన్నే తినాలి. అయితే పచ్చి మాంసం, గుడ్లు, కూరగాయలను పట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

* తరచూ మంచి నీళ్లు తాగుతుండాలి. ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారిలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది.  ఆ అలవాట్లు ఉన్నవారికి అంటువ్యాధుల ముప్పు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అలవాట్లను మానుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: