తెలంగాణలో కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. ప్రతి 100 టెస్టుల్లో 14 పాజిటివ్ లు వస్తున్నాయంటే, వైరస్ ఎంతగా వ్యాపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో ప్రతి 100 పరీక్షల్లో 6.11 శాతం పాజిటివ్ రేట్ ఉండగా, తెలంగాణలో అది 14.39 శాతానికి పెరిగింది. ముఖ్యంగా ఏప్రిల్ 28 నుంచి ఈ రేటు భారీగా పెరుగుతోంది. తెలంగాణలో కరోనా టెస్టులు చేసేందుకు ప్రైవేట్ ల్యాబ్ లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్స్ ప్రతినిధులతో ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు హైదరాబాదులో భేటీ అయ్యారు.

 

ఈ నేపథ్యంలో మంత్రి ఈటెల మాట్లాడుతూ.. ఇప్పటి వరకు డాక్టర్లు.. ఇతర సిబ్బంది కరోనా భారిన పడ్డవారిని ఎంతో జాగ్రత్తగా కాపాడారని.. వారి సేవలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. కరోనాతో ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. కరోనాను వ్యాపార కోణంలో చూడవద్దని, మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు.  కరోనా చికిత్సలో సర్వైలెన్స్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ అనే మూడు విధానాలు కలిసి ఉన్నాయని... ఈ నేపథ్యంలో పాజిటివ్ గా తేలిన ప్రతి వ్యక్తి వివరాలను పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. 

 

కరోనా పరీక్షలకు, సాధారణ పరీక్షలకు చాలా తేడా ఉందని మంత్రి చెప్పారు. కరోనా కేసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆరోగ్యశాఖకు అందించాలని తెలిపారు.  కరోనా కేసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆరోగ్యశాఖకు అందించాలని తెలిపారు. శాంపిల్స్ తీసుకున్న వారి రిజల్ట్స్ వచ్చేంత వరకు వారిని ఐసొలేషన్ లోనే ఉంచాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: