నేడు దేశీయ మార్కెట్ లాభాల బాట పట్టింది. బెంచ్ మార్క్ సూచీలన్ని కూడా లాభాల్లోనే ముగిశాయి. నేడు 74 వ రోజు వరుసగా స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. అన్ని రంగాల షేర్లు కొనుగోలు కనిపించడంతో స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. ఇక నేడు ఇంట్రాడేలో సెన్సెక్స్ 571 పాయింట్ల ర్యాలీ చేసి 35482 పాయింట్లు గరిష్టాన్ని చేరుకోగా, అలాగే నిఫ్టీ కూడా 104 పాయింట్ల లాభంతో 10485 గరిష్ట పాయింట్ల వద్దకు చేరుకుంది. ఇక మార్కెట్ సమయం ముగిసే సరికి సెన్సెక్స్ 519 పాయింట్లు లాభంతో 35430 పాయింట్ల వద్ద అలాగే NSE 50 160 పాయింట్లు లాభంతో 10471 పాయింట్ల వద్ద ముగిశాయి.

 

 

ఇక నేడు స్టాక్ మార్కెట్ లోని లాభం విషయానికి వస్తే నిఫ్ట్య్ 50 లో బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టిపిసి, హిందాల్కో షేర్లు లాభాల బాట పట్టగా అందులో బజాజ్ ఫైనాన్స్ ఏకంగా తొమ్మిది శాతం పైగా లాభపడింది. ఇక మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, వేదాంత, మారుతి సుజుకి షేర్లు నష్టాల బాట పట్టగా అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక శాతం పైగా నష్టపోయింది. 

 

 

ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల విషయానికి వస్తే... బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ కి 1.6 శాతం పెరిగి 43.77 డాలర్లకు చేరుకుంది. మరోవైపు WTA ముడి చమురు ధర కూడా 1. 74 శాతం లాభపడి 41.44 డాలర్లకు చేరుకుంది. ఇక అలాగే అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి అమెరికా డాలర్ తో పోల్చి చూస్తే భారత మారకపు విలువ 38 పైసలు లాభపడి 75.64 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: