ఈ మధ్య కాలంలో భూములకు సంబంధించిన వివాదాలే కుటుంబాల ఘర్షణకు, యుద్ధాలకు, హత్యలకు కారణమవుతున్నాయి. పాక్ భారత్ దేశాల మధ్య యుద్ధాలకు భూములే కారణం. ఈ భూములు నేతల కోసమో ఎవరి కోసమో కాదు. దేశ రక్షణ కోసం ఈ భూములు అవసరం. ఈ నెల 15వ తేదీన 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడానికి కూడా దేశంలోని భూములే పరోక్షంగా కారణం. దేశానికి అత్యంత కీలకమైన సరిహద్దు ప్రాంతంలో శత్రుదేశపు ఆధిపత్యం రాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో సరిహద్దుల్లో సైనికులు నిత్యం పహారా కాస్తారు. 
 
శత్రు దేశం మన దేశం భూభాగంపై ఆధిపత్యం చలాయించడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది. సియాచిన్ లో మనం విమానశ్రయం కట్టుకున్నాం కాబట్టి కింద ఉన్న చైనా బాధ పడుతూ ఉంటుంది. ఏ దేశం కూడా యుద్ధాన్ని కోరుకోదు. అదే సమయంలో ఇతరులకు అవకాశం కూడా ఇవ్వదు. అయితే చైనా భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనటానికి కారణాలేమిటని ఆరా తీస్తే కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
టిబెట్ చైనాలో భాగం కాబట్టి గాల్వన్ లోయ తమదని చైనా దేశం చెబుతూ ఉంటుంది. నిజానికి టిబెట్ విలీనాన్నే ప్రపంచం ఒప్పుకోవటం లేదు. అయితే ఈ లోయ ఉన్న ప్రాంతం 40 శాతం చైనా చేతిలో ఉంటే 60 శాతం భారత్ చేతిలో ఉంది. భారత్ చేతిలో ఉన్న గాల్వన్ లోయలో నిర్మిస్తున్న వంతెనలు పూర్తైతే మాత్రం చైనాకు భారత్ పై ఆధిపత్యం చలాయించటం ఎట్టి పరిస్థితుల్లోను కుదరదు. మనం గాల్వన్ లోయ దగ్గరరోడ్లు, వంతెనలు, ఎయిర్ స్ట్రిప్స్ నిర్మాణం ఆపివేస్తే చైనాకు అసలు ఏ బాధ లేదు. 
 
అక్కడ వంతెనలు, ఇతర నిర్మాణాలు జరిగితే మాత్రమే చైనాకు సమస్య అవుతుంది. ప్రస్తుతం మోదీ సర్కార్ పనులు వేగంగా చేస్తూ ఉండటంతో... గాల్వన్ లోయ దగ్గర పనులు పూర్తవుతూ ఉండటంతో చైనా కంగారు పడుతోంది. భారత్ నిర్మాణాలు పూర్తి చేస్తే భవిష్యత్తుల్లో ఆధిపత్యం సాధించడం చైనాకు సాధ్యం కాదు. పీవోకేను భారత్ ఆక్రమించాలని ప్రయత్నిస్తే ఆ సమయంలో భారత్ ను ఆపటానికి గాల్వన్ లోయ కీలకం కావడంతో చైనా సరిహద్దు వివాదాలను సృష్టిస్తూ గాల్వన్ లోయ తమదేనంటూ వ్యాఖ్యలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: