కొవిడ్ 19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ లాక్ డౌన్ వ‌ల్ల ఎంతో మంది నిరుద్యోగులు అయ్యారు.. ఎంతో మంది బికారులు అయ్యారు.. మ‌రెంతోమంది తిన‌డానికి తిండి లేక విల‌విల్లాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ లాక్ డౌన్ ప్ర‌జ‌ల ఆహార అల‌వాట్ల‌ను సైతం మార్చేసింద‌ని ప‌లు నివేదిక‌లు చెపుతున్నాయి. ఈ లాక్ డౌన్ వల్ల ఎక్కువ శాతం ప్రజలు స్నాక్స్, చిప్స్ కు అలవాటు పడ్డారని తెలుస్తోంది.

 

న్యూయార్క్ టైమ్స్  చేసిన స‌ర్వేలో ఈ ఆస‌క్తికర విష‌యాలు వెల్ల‌డి అయ్యాయి. లాక్ డౌన్ వ‌ల్ల ప్ర‌జ‌లు రెగ్యుల‌ర్ ఆహారంతో పాటు బ‌ర్గ‌ర్లు, పిజ్జాలు, ఫ్రూట్స్ క‌న్నా ప్రజలు స్నాక్స్ కి ఎక్కువగా కొనుగోలు చేశారని నివేదికలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా మార్చి నుంచి స్నాక్స్, చిప్స్ వంటి ప్రాసెస్డ్ పుడ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కొనుగొలు జరిగాయి అని నివేదికలు తెలుపుతున్నాయి. క్వారంటైన్ లో అందరూ ఎక్కువగా చిరుతిండిని ఇష్టపడుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఇవి త‌క్కువ ధ‌ర‌కు ల‌భించ‌డంతో పాటు ప్ర‌జ ఆదాయం త‌గ్గిపోవ‌డం, కొనుగోలు శ‌క్తి ప‌డిపోవ‌డం కూడా ఇందుకు ఓ కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. 

 

ఇక ఇప్ప‌ట్లో మాల్స్‌, రెస్టారెంట్లు తిరిగి ప్రారంభించినా ఎంత ధ‌న‌వంతులు అయినా, ధ‌నిక వ‌ర్గాల వారు అయినా కూడా వీటికి వ‌స్తారు అని ఆశించ‌డం అత్యాశే అవుతుంద‌ని అంటున్నారు. ఇక ఈ సర్వే ప్ర‌కారం ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి పెర‌గాల‌న్నా, మాల్స్‌, రెస్టారెంట్లు స‌క్సెస్ అవ్వాల‌న్నా వ‌చ్చే యేడాది వ‌ర‌కు టైం ప‌డుతుంద‌ని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: