భారత్‌లోని అన్ని సహకార బ్యాంకులను ఆర్‌బీఐ పరిధిలోకి తీసుకు వ‌స్తూ కేంద్ర ప్ర‌భుత్వం చాలా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కూడా ఆమోద ముద్ర ప‌డ‌టం గ‌మ‌నార్హం. భారత్‌లో 1,482 అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులతో పాటు 58 మల్టీ స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకులు ఉన్నాయి. ఇకపై ఇవన్నీ ఆర్‌బీఐ పరిధిలోకి రానున్నాయి. 1482 అర్బన్-కో-ఆపరేటివ్ బ్యాంకులతో బాటు 58 మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులను ఆర్ బీ ఐ సూపర్ వైజరీ పవర్స్ కిందికి తేనున్నారు. ఎనిమల్ హజ్ బెండ్రీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ ని ఏర్పాటు చేసి… మూడు శాతం వడ్డీతో లబ్దిదారులను ఆదుకోవాలని నిర్ణయం. యూపీ లోని ఖుషినగర్ ఎయిర్ పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని నిర్ణయించారు.

 

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానాంశాలు .ప్రధానమంత్రి ముద్ర యోజన కింద శిశు  లోన్ కేటగిరీ వర్గాలకు రెండు శాతం వడ్డీతో రుణాలు ఇవ్వనున్నారు. ఇతర వెనుకబడిన తరగతులలో సబ్-కేటగిరైజేషన్ అంశాన్ని పరిశీలించేందుకు రాజ్యాంగం లోని 340 అధికరణం కింద ఏర్పాటు చేసిన కమిషన్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశానంతరం మాట్లాడిన ప్రకాష్ జవదేకర్.. దేశంలోని అన్ని కో-ఆపరేటివ్ బ్యాంకులను రిజర్వ్ బ్యాంకు పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్సును కేబినెట్ ఆమోదించ‌డం జరిగింద‌ని తెలిపారు. 

 

1,540 సహకార బ్యాంకులను ఆర్‌బీఐ పర్యవేక్షణలోకి తీసుకురావాలన్న నిర్ణయంతో 8.6 కోట్ల మంది డిపాజిటర్ల సొమ్ము రూ.4.84 లక్షల కోట్లకు భద్రత ఉంటుందన్నారు.  ముద్రా యోజన కింద 2శాతం వడ్డీ రాయితీ పథకానికి, అలాగే ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ ఎయిర్ పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని జ‌వ‌దేక‌ర్ స్ప‌ష్టం చేశారు. అలాగే కేంద్ర మంత్రివర్గ సమావేశం కూడా ఓబీసీ కులాల్లో ఉప వర్గీకరణ అంశాన్ని పరిశీలించేందుకు రాజ్యాంగంలోని 340వ అధికరణం కింద ఏర్పాటు చేసిన కమిషన్ పదవీకాలాన్ని 6 నెలల పాటు ( 2021, జనవరి 31 వరకు) పొడగిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింద‌ని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: