భారత్‌లో ప్రతి లక్ష మందిలో ఒకరు కరోనా మహమ్మారితో మరణిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మిగతా దేశాలతో పోలిస్తే కరోనా కేసులు, మరణాల సంఖ్య తక్కువగానే ఉందని పేర్కొంది. ఫిబ్రవరిలో మొదలైన కరోనా కేసులు మార్చిలో బాగా పెరిగాయి.. దాంతో లాక్ డౌన్ ప్రకటించారు.  అప్పటి నుంచి దాదాపు రెండు నెలలు మాత్రం చాలా సీరియస్ గా లాక్ డౌన్ కొనసాగించారు.  ఆ సమయంలో కరోనా కేసలు ఓ మాదిరిగా పెరిగాయి. కాకపోతే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు లో బాగా పెరిగాయి.  ఇటీవల లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి మళ్లీ దారుణంగా పెరిగిపోయాయి. 

 

దేశంలో ఇప్పటి వరకు  2.58 లక్షల మంది కరోనా బారి నుంచి కోలుకున్నారని, రికవరీ రేటు 56.7 శాతంగా ఉందని వివరించింది. కాగా, నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 15,968 మంది కరోనా బాధితులుగా మారగా, 465 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలుపుకుని దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య  4,56,183కు పెరగ్గా 14,476  మృతి చెందారు. భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.

 

ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 16,922 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 418 మంది మరణించారు. 1,86,514 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,71,697 మంది కోలుకున్నారు. తెలంగాణపై కరోనా రక్కసి కోరలు చాస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 891 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: