వారం రోజుల క్రితం గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో భారత సైనికులు 20 మంది మృతి చెందగా చైనా సైనికులు 40 మందికి పైగా చనిపోయారని సమాచారం. ఈ ఘర్షణల అనంతరం చైనా భారత్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు భారీ సంఖ్యలో జవాన్లను సరిహద్దు ప్రాంతాల్లోకి తరలిస్తున్నాయి. 
 
అదే సమయంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి. చైనా దేశ అధ్యక్షుడు ఎన్ని ఎత్తులు వేస్తున్నా ప్రధాని మోదీ ఆ ఎత్తుగడలను చిత్తు చేస్తూ వస్తున్నారు. గాల్వన్ లోయ తమదేనని భారత్ ఆ లోయను ఆక్రమించే ప్రయత్నం చేస్తోందని చైనా ఆరోపణలు చేస్తోంది. గాల్వన్ లోయలో 60 శాతం మనది కాగా 40 శాతం చైనాది. భారత్ ఈ లోయ విషయంలో చైనాకు ఆధిపత్యం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. 
 
అయితే గాల్వన్ లోయ తమదేనని అది టిబెట్ కు సంబంధించిన భాగం అని అందువల్లే ఆ లోయ తమకే చెందుతుందని చైనా చెబుతోంది. చైనా భారత్ మధ్య నెలకొన్న ఈ సమస్యను అంతర్జాతీయ కోర్టులు కూడా పరిష్కరించలేవు. టిబెట్ చైనాది కాదని ప్రపంచమే అంగీకరిస్తున్న తరుణంలో చైనాకు గాల్వన్ లోయపై హక్కు లేదు. ప్రపంచ దేశాలు సైతం భారత్ కే మద్దతు పలుకుతున్నాయి. 
 
జిన్ పింగ్ ఎత్తులు మాత్రం మరో విధంగా ఉన్నాయి. గాల్వన్ లోయ భారత్ తమది కాదని చెబితే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ప్రాంతాలను ఆక్రమించాలని చైనా ప్రయత్నిస్తోంది. మరోవైపు మోదీ సైతం వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారు. జపాన్ అకస్మాత్తుగా బిల్లును తీసుకురావడం, అమెరికా ఫిలిప్పీన్స్ దగ్గర తన బృందాలను ఏర్పాటు చేయడం, నేపాల్ లో ఉద్యమాల ద్వారా మోదీ పరోక్షంగా జిన్ పింగ్ కు ఇబ్బందులు కలగజేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిన్ పింగ్ ఎత్తులను మోదీ చిత్తు చేస్తున్నారని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: