ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ఈ నెల 23వ తేదీన కరోనిల్ అనే పేరుతో ఆయుర్వేద మాత్రలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మందులపై పెద్దఎత్తున దుమారం చెలరేగుతోంది. ఆయుష్ మంత్రి శ్రీపాద నాయక్ తమకు మందు గురించి సమాచారం ఇవ్వలేదని చెప్పగా పతంజలి సంస్థ కరోనిల్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో కరోనా వైరస్ పేరునే ప్రస్తావించలేదని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విచారణలో తేలింది. 
 
దగ్గు, జ్వరం నియంత్రణకు ఆయుర్వేద మందు తీసుకొస్తున్నట్లు ఆ సంస్థ తన దరఖాస్తులో పేర్కొందని ఉత్తరప్రదేశ్ సర్కార్ చెబుతోంది. అయితే మరోవైపు పతాంజలిపై మేధావులు పగబట్టారా....? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వివిధ పేర్లతో వచ్చిన విదేశీ మందుల గురించి భారత్ లోని మేధావులు, ప్రభుత్వాలు ప్రశంసల వర్షం కురిపించాయి. ఆ మందులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. 
 
అయితే ఆ మందులు కరోనాను పూర్తిస్థాయిలో నయం చేయలేవని వైద్యులు చెబుతున్నారు. ఈ మందుల ఖరీదు ఎక్కువ. సహజసిద్ధంగా వైరస్ ల కోసం వాడే మందులే అవి అని వాటి వల్ల పూర్తిగా ఫలితం ఉండదని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో పతాంజలి కరోనాను ప్రాథమిక దశలో నివారించడానికి, సోకకుండా ఉండటానికి తమ మందు పనికొస్తుందని ప్రకటన చేసింది. 
 
కరోనా నుంచి బయటపడటానికి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం మాత్రమే మార్గం అని వైద్యులు చెబుతున్నారు. పతాంజలి కనిపెట్టిన కరోనిల్ రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందని చెప్పినా ఆ మందుపై కొందరు మేధావులు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారు. కరోనా సోకకుండా మందును అందుబాటులోకి తెస్తామని బాబా రాందేవ్ చెబుతుంటే పనిగట్టుకొని విమర్శలు చేసి మందును మార్కెట్లోకి తీసుకురాకుండా ప్రయత్నాలు జరుగుతుండటం గమనార్హం. భారత్ కు చెందిన మందులు కాబట్టే మేధావులు అని చెప్పుకునే కొందరు పతాంజలి కరోనిల్ పై విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: