2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఒకటి. జిల్లాలో మొత్తం 15 సీట్లు ఉంటే వైసీపీ 13 సీట్లు గెలిచేసి సంచలనం సృష్టించింది. అటు టీడీపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ జెండా ఎగిరింది. అయితే అదే 2014 ఎన్నికల్లో మాత్రం టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 15 సీట్లు టీడీపీ-బీజేపీ కూటమి ఖాతాలో పడ్డాయి. ఇక అప్పుడు పవన్ నేతృత్వంలోని జనసేన పోటీకి దిగకుండా టీడీపీకి మద్ధతు తెలపడం వల్ల క్లీన్ స్వీప్ సాధ్యమైంది.

 

కానీ 2019 ఎన్నికలోచ్చేసరికి టీడీపీ, బీజేపీ, జనసేనలు విడివిడిగా పోటీ చేశాయి. దాంతో వైసీపీకి 13 సీట్లు వచ్చేశాయి. అయితే ఎన్నికలు ముగిసి ఏడాది దాటేసింది. రాష్ట్రాన్ని జగన్ సమర్ధవంతంగా పనిచేస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాలనని పరుగులెత్తిస్తున్నారు. అయితే రాష్ట్ర స్థాయిలో జగన్ పాలన బాగున్న...నియోజకవర్గాల స్థాయిలో కొందరు ఎమ్మెల్యేల పనితీరు అంతగా బాగోలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో ఓడిపోయిన టీడీపీ నేతలు మళ్ళీ కష్టపడి పనిచేసుకోవడం వల్ల కొన్ని చోట్ల పరిస్థితులు మారాయి.

 

ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఎలాగో పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ టీడీపీ పరిస్తితి చాలా మెరుగ్గానే ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఈ రెండు చోట్ల టీడీపీకి తిరుగులేదని తెలుస్తోంది. అయితే ఊహించని విషయం ఏంటంటే వెస్ట్‌లో టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాగా పుంజుకున్నారట. ఓడిపోయినా సరే ఆయన నిత్యం ప్రజల్లో ఉండటం, పైగా వైసీపీ ప్రభుత్వం కావాలని కేసులు పెట్టి జైలుకు పంపడం వల్ల, ఆయనపై సానుభూతి పెరిగిందట. నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన విజయం ఖాయమని దెందులూరు నియోజకవర్గంలో టాక్.

 

ఇక గోపాలాపురం నియోజకవర్గంలో కూడా టీడీపీ పరిస్థితి చాలా మెరుగుపడిందట. అంటే వెస్ట్‌లో పాలకొల్లు, ఉండి, దెందులూరు, గోపాలాపురం సీట్లలో టీడీపీ మంచి పొజిషన్‌లో ఉంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు గనుక పోటీలో ఉంటే వైసీపీకి చుక్కలు కనిపిస్తాయని వెస్ట్ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. దాదాపు 10 సీట్లు పైనే ఈ రెండు పార్టీలు గెలిచే అవకాశముందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: