అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చంద్రుడి పై మరుగుదొడ్డి కట్టడానికి ప్రజల సహాయం కోరుతుంది. చంద్రుడి పై మరుగుదొడ్ల నిర్మాణానికి ఒక మంచి డిజైన్ రూపొందించి అది నాసా సంస్థ కి పంపిస్తే... అది వారికి నచ్చితే 35 వేల డాలర్లు మన సొంతం అవుతాయి. అంటే మన ఇండియన్ కరెన్సీ లో  రూ. 26 లక్షలు అన్నమాట. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన నాసా తమ ఆర్టెమిస్ మిషన్ కింద 2024 లోపు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించి అక్కడ శాశ్వత స్థావరాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే చంద్రుడిపై అడుగు పెట్టిన ఆ వ్యోమగాములకు కచ్చితంగా మరుగుదొడ్లు అవసరమవుతాయి. అందుకే వారి కనీస అవసరాలను తీర్చేందుకు నాసా ఇప్పటి నుంచే వినూత్నమైన మరుగుదొడ్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంది. 


సాధారణంగా చంద్రుని పై తక్కువ గురుత్వాకర్షణ శక్తి అనగా మనం నివసిస్తున్న భూమిపై ఉన్నట్టు ఉండదు. ఫలితంగా వ్యోమగాములు విడిచిపెట్టిన ప్రతిదీ గాల్లో తేలుతూనే ఉంటుంది. ఇలా విడిచిపెట్టిన వ్యర్థం చంద్రుడిపై తిరుగుతూ ఉంటే వ్యోమగాములకు ఇబ్బందిగా మారుతుంది కాబట్టి అలా జరగకుండా ఉండేందుకు నాసా అనేక ఆలోచనలు చేసి చివరికి ఎవరైతే మరుగుదొడ్ల సమస్య కు పరిష్కారం చూపుతారో వారికి డబ్బులు ఇస్తానని ఒక పోటీ పెట్టింది. 


అప్పట్లో అపోలో మిషన్ లో భాగంగా చంద్రుడిపై అడుగుపెట్టిన వ్యోమగాములు అడల్ట్ డైపర్స్ ని తొడుగుకొని మల మూత్ర విసర్జన లను కానిచ్చేశారు. అప్పుడు మరుగుదొడ్ల నిర్మాణం పై అంతగా శ్రద్ధ పెట్టలేక ఎలాగోలా ఆ సమస్యను ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు మాత్రం ఆ సమస్యకు పరిష్కారం వెతికేందుకు నాసా సిద్ధమవుతోంది. ఆర్టెమిస్ మిషన్ లో మహిళ వ్యోమగాము కూడా ఉండగా... మరుగుదొడ్డి నిర్మాణం ఆడవారికి,  మగవారికి ప్రత్యేకంగా ఉండేలా రూపకల్పన చేయాల్సి ఉంటుంది. అలాగే మరుగుదొడ్డి నిర్మాణ రూపకల్పన లో నీళ్ళు ఎక్కువగా ఖర్చు అవ్వకుండా, దుర్వాసన రాకుండా, చెడు క్రీములు దరిచేరకుండా ఉండేట్టు ఉండాలి. 


వ్యోమగాములు టాయిలెట్ బేసిన్ కి మొహం దగ్గరగా పెట్టకుండానే వాంతులు చేసుకునేలా మరుగుదొడ్ల డిజైన్ తయారు చేసినవారికి ఎక్కువ డబ్బులు నాసా ఇస్తుంది. ఇద్దరు వ్యోమగాములకు 14 రోజుల వరకు ఉపయోగపడేలా ఒక్క మరుగుదొడ్డి నిర్మాణం ఉండాలి. 14 రోజుల అనంతరం వ్యోమగాముల వ్యర్థం మరుగుదొడ్ల నుండి ఒక వాహనంలోకి వెళ్తుంది. ఒకరు మలవిసర్జన చేసిన ఐదు నిమిషాల్లోపే మరొకరు మలవిసర్జన చేసేంత శుభ్రంగా ఉండేలా మరుగుదొడ్ల నిర్మాణం ఉండాలి. అయితే మరుగుదొడ్ల నిర్మాణ ప్లాన్ ని రూపొందించినవారు ఆగస్టు 17 లోపు నాసా సంస్థకి పంపించాల్సి ఉంటుంది. మీరు కూడా నాసా కి సహాయం చేసేందుకు ప్రయత్నించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: