దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు వ్యాప్తి చెందుతోన్న ఈ వైరస్ విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వందల్లో కేసులు నమోదవుతూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. దేశంలోని కార్పొరేట్ స్కూళ్లు విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల ద్వారా బోధిస్తున్నాయి. 
 
కాలం మారుతుండటంతో పాటు కరోనా భారీన పడిన వాళ్లు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుండటంతో పాటు ఆర్థికంగా కష్టాలు పెడుతోంది. మరోవైపు పాతిక సంవత్సరాల ముందుకు మనల్ని తీసుకెళుతోంది. జూమ్ యాప్ ద్వారా సమావేశాలు, వర్చువల్ ర్యాలీలు రెండు మూడు సంవత్సరాల క్రితం సామాన్యులకు కనీస అవగాహన కూడా లేనివి. 
 
కానీ నేడు వీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రతిచోటా జూమ్ మీటింగులు జరుగుతున్నాయి. మరోవైపు స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారో ఎవరికీ తెలియటం లేదు. అయితే పలు స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తూ ఉండటంతో పిల్లల కోసం ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లను తల్లిదండ్రులు కొనాల్సిన పరిస్థితి నెలకొంది. పేద, మధ్య తరగతి వర్గాలు మాత్రం విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లను కొనివ్వలేకపోతున్నారు. 
 
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సీఎం కేసీఆర్, సీఎం జగన్ ల్యాప్ టాప్ లు పంచితే బాగుంటుందని ప్రజలనుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ దిశగా చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని.... వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. మరి ముఖ్యమంత్రులు ల్యాప్ టాప్ లు పంచుతారా....? లేదా...? తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.           

మరింత సమాచారం తెలుసుకోండి: