సీఎం జగన్ కు రాజధాని అమరావతిలో ఉండటం ఇష్టం లేదు. ఈ విషయం మొదటి నుంచి తెలిసిందే. కానీ ఆ నిర్ణయం తీసుకునే సమయంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు.. ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు అధికారం చేతికి వచ్చింది. చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి అంటూ ప్రకటించడమే తప్ప అక్కడ చేసేందేమీలేకపోవడంతో రాజధాని మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు.

 

 

ఇప్పటికే విశాఖను రాజధానిగా ప్రకటించేశాడు.ఇక సాంకేతికంగా రాజధాని విశాఖకు తరలిపోవడమే మిగిలింది. ఇన్నాళ్లూ మండలిని అడ్డుపెట్టుకుని రాజధాని తరలింపు ఆపిన టీడీపీకి ఇక ఆ ఆశ కూడా కనుమరుగవుతోంది. అయితే కరోనా వచ్చి మధ్యలో జగన్ ప్రణాళికలకు అడ్డుకట్ట వేసింది. ఏదేమైనా రాజధాని తరలింపు మాత్రం ఖాయమన్నది వైసీపీ నేతల మాట.

 

 

అయితే.. టీడీపీ శ్రేణులు మాత్రం.. రాజధాని మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఏ నమ్మకంతో చెబుతున్నారో కానీ.. ఏపీ రాజదానిని అమరావతి నుంచి ముఖ్యమంత్రి జగన్ తరలించలేరని టీడీపీ నేత నేత వర్ల రామయ్య కుండబద్దలు కొట్టి చెప్పేస్తున్నారు. రాజధాని ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం యత్నిస్తోందని వర్ల అంటున్నారు.

 

 

అమరావతి పరిరక్షణ కోసం జెఎసి చేస్తున్న ఉద్యమానికి టిడిపి అన్ని రకాలుగా అండగా ఉంటుందని వర్ల అన్నారు. రాజధానిపై ముఖ్యమంత్రి కక్షతో వ్యవహరిస్తున్నారని వర్ల రామయ్య అంటున్నారు. జగన్ ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగించడం లేదని ఆయన ఆరోపించారు. మరి నిజంగానే జగన్ రాజధానిని మార్చలేరా.. టీడీపీ ఎందుకు అంత నమ్మకంగా చెబుతుంది.. దీని వెనుక ఏమైనా అంతరార్థం ఉందా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: