పోలీసులు అంటే న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడేవారు అని అర్ధం. ప్రజల ప్రాణాల్ని కాపాడడం కోసం తమ ప్రాణాల్ని సైతం పోగొట్టుకునేవారు పోలీసులు. కానీ ఇలాంటి పోలీసులను మనం సినిమాల్లో చూస్తాము. రియల్ లైఫ్ లో కూడా నీతి నిజాయితీకి కట్టుబడే పోలీసులు కూడా ఉన్నారనుకోండి. కానీ ఒకే ఒక్క పోలీసు చేసిన తప్పు  వల్ల మొత్తం పోలీసులనే తప్పు పట్టే సంఘటనలు ఎన్నో నిజంగా జరిగాయి. అలాంటి కొంత మంది పోలీసులు చేసిన పనికి ఒక సినిమా దర్శకుడు సిగ్గుపడుతున్నాడట. ఎన్నో సినిమాల్లో  పోలీసులను హీరోలుగా చూపిస్తూ వరుస విజయాలను అందుకున్న 'సింగం' సినిమా దర్శకుడు ఇప్పుడు పోలీసులపై  సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పోలీసు సినిమాలు చేసినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నానని హరి గోపాలకృష్ణన్ అన్నారు.

 

 

 

 

తాను ఇప్పటి వరకు ఐదు పోలీసు సినిమాలు చేశానని, ఇక ముందు అలాంటి పోలీసు సినిమాలు తీసి  తప్పు చేయబోనని అన్నారు. సినిమాల్లో పోలీసుల  యొక్క ధైర్య సాహసాలను హైలైట్ చేస్తూ సినిమాలు తీసి తప్పు చేశానని పేర్కొన్నాడు.ఆ సినిమాలు చూసి ప్రేక్షకులు సైతం పోలీసు అంటే నిజంగా ఇలా ఉంటాడా అన్న భావనలో ఉంటారు. కానీ నిజానికి పోలీసులు అలా లేరని  తమిళనాడులో వరుసగా జరిగిన సంఘటనలు ద్వారా తెలుస్తుంది. ఈ మధ్య తమిళనాడులో  లాకప్ డెత్‌లు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దర్శకుడు గోపాలకృష్ణన్  ఇలా  మాట్లాడారు. ఇలాంటి హత్యలు మరోసారి జరగకూడదని అభిప్రాయపడ్డారు. కొంత మంది వల్ల మొత్తం పోలీసు వ్యవస్థ పరువు పాతాళంలోకి వెళ్లిపోయిందని తెలిపారు.

 

 

 

బడా  హీరో విక్రమ్‌తో 'స్వామి' అలాగే  హీరో సూర్యతో 'సింగం' సినిమాలు చేసి విజయాలను సాధించారు. ఆ సినిమాల్లో పోలీసులు  వారి కర్తవ్యాలను ఎలా నిర్వహిస్తారో అన్న విషయాల్ని బాగా చూపించారు. పోలీసుల హీరోయిజాన్ని చూపిస్తూ  అందరితో ప్రశంసలు పొందారు.అయితే నిజ జీవితంలో పోలీసులు అలా లేరు.  తుత్తుకూడిలో తండ్రీ కొడుకుల లాకప్ డెత్, మరో చోట ఆటో డ్రైవర్ పై దాడి ఘటనలను హరి గోపాలకృష్ణన్ తీవ్రంగా ఖండించారు. ఇంతలా  దారుణంగా వారిని హింసించి చంపడం ఏంటని ప్రశ్నించారు.తమిళనాడులో ఇలాంటి ఘటనలు మరోసారి జరుగ కూడదని కోరుకుంటున్నానని చెప్పారు. అయితే వరుస లాకప్ డెత్‌లపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: