చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విజృంభణ వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. పలు దేశాల్లో వేల సంఖ్యలో ప్రజలు వైరస్ భారీన పడి మృతి చెందారు. అమెరికా, బ్రెజిల్, భారత్, ఇతర దేశాలు కరోనా ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. ప్రపంచ దేశాలు కరోనాను నియంత్రించలేక సతమతమవుతుంటే చైనా మాత్రం వైరస్ నియంత్రణలో కొన్ని నెలల క్రితం సక్సెస్ అయింది. 
 
కానీ ప్రస్తుతం చైనాలో పరిస్థితి తారుమారైంది. ప్రస్తుతం చైనాలో ఈ వైరస్ అతిపెద్ద సమస్యకు కారణమైంది. కొన్ని రోజుల క్రితం చైనాలో జీరో కేసులు అని ప్రకటించుకున్న ఆ దేశం ప్రస్తుతం సీరియస్ పరిస్థితులను ఎదుర్కొంటోంది. చైనా రాజధాని బీజింగ్ లో 5 లక్షల మందిపై ఆంక్షల ప్రభావం పడబోతుందని తెలుస్తోంది. బీజింగ్ నుంచి 150 కిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతాలను మూసివేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
నిత్యావసరాలు, మందులు, ఆహారం కొనుగోళ్లకు మాత్రమే ఆంక్షలు విధించిన ప్రాంతాల్లో చైనా అనుమతులివ్వనుంది. చైనా రవాణాపై సైతం ఆంక్షలు విధించింది. అయితే చైనాలో ప్రభుత్వానికి పూర్తి అధికారులు ఉంటాయి కాబట్టి ప్రజలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. చైనా రాజధానిలోనే వైరస్ వల్ల ఇలాంటి పరిస్థితి రావడం గమనార్హం. పెరుగుతున్న కేసులతో ప్రభుత్వం టెన్షన్ పడుతోంది. 
 
వివిధ కారణాల వల్ల చైనా నుంచి పలు కంపెనీలు ఇతర దేశాలకు తరలిపోతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఆ కంపెనీలతో బీజింగ్ లో చర్చలు జరపాల్సి ఉంటుంది. చైనాలో మాంసం దుకాణం నుంచే మరోసారి వైరస్ వ్యాప్తి చెందింది. చైనాలో మాంసాహార ప్రియులు ఎక్కువగా ఉండటం వల్ల ఆ దేశంలో మాంసం వినియోగం ఎక్కువ. కరోనా వైరస్ విజృంభణ వల్ల చైనాకు సరికొత్త సమస్య ఏర్పడిందని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: