జూన్ 15వ తేదీన చైనా భారత్ దేశాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ దగ్గర ఉద్రిక్తత సడలినప్పటికీ చైనా మార్షల్ ఆర్ట్స్ దళాలను అక్కడ మోహరించగా భారత్ ఘాతక్ కమాండోలను రంగంలోకి దింపింది. చైనా సరిహద్దుల్లో సైన్యానికి శిక్షణ ఇచ్చేందుకు మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్లను తీసుకొచ్చి సైనికులకు శిక్షణ అందించింది. 
 
జూన్ 15వ తేదీ ఘర్షణలు జరగక ముందే చైనా మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్లను సైన్యంలోకి చేర్చుకుంది. వీరిని సమర్థంగా ఎదుర్కోవడానికి భారత్ కమాండోలను రంగంలోకి దించింది. కర్ణాటకలోని బెల్గాం పట్టణ శివారు శిబిరంలో ఘాతక్ కమాండోలు 43 రోజుల ప్రత్యేక కమాండ్ శిక్షణా కోర్సును పూర్తి చేశారు. వీరు శిక్షణలో భాగంగా 35 కిలోల బరువు ఎత్తడం లాంటి కఠిన శిక్షణ ఉంటుంది. ఇక్కడి శిక్షణలో వారికి ప్రత్యేక ఆయుధాల శిక్షణ, పోరాట శిక్షణ అందిస్తారు. 
 
ఘాతక్ కమాండోలు బెటాలియన్ సభ్యులలోని ఎవరి సహాయం అవసరం లేకుండానే దాడి చేయడంలో శిక్షణ పొంది ఉంటారు. ఆయుధం లేకుండా పోరాడటంలో కూడా ఘాతక్ కమాండోలు శిక్షణ పొందుతారు. వీళ్లు ఫిరంగి స్థావరాలు, డంపింగ్ క్షేత్రాలు, వాయు క్షేత్రాలు లాంటి ప్రధాన కార్యకలాపాలపై ప్రత్యక్ష దాడులకు దిగుతారు. వీళ్లు శత్రువులు కోలుకునేందుకు అవకాశం ఇవ్వకుండా దాడులకు దిగుతారు. 
 
మరోవైపు గల్వాన్ లోయలో ప్రతిష్టంభన నేటికీ తగ్గలేదు. అయితే యుద్ధం పరిస్థితులు వస్తే మాత్రం భారత్ కు అమెరికా తప్పకుండా సహాయం చేస్తుందని చైనా భావిస్తోంది. అమెరికా భారత్ కు మద్దతు ఇస్తోందని చైనా అధికార వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. చైనా కథనంలో అమెరికా మద్దతును సద్వినియోగం చేసుకోవచ్చని భావిస్తే అది వారిని మరింత గందరగోళంలోకి నెట్టడం ఖాయమని పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: