కరోనా విషయంలో దుష్ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేస్తున్నారని మంత్రులు మండిపడుతున్నారు. కరోనాపై తెలంగాణ తీరును విమర్శిస్తున్నవారు హైదరాబాద్ బ్రాండ్ ని దెబ్బ తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ మెస్సేజ్ వైరల్ అవుతోంది. అదేంటో చూడండి..

 

 

 

"కరోనా అడుగే పెట్టనియనూ అన్నది ఎవరూ?

ప్రపంచ స్థాయిలో వైద్యం అందిస్తామన్నది ఎవరు?

సకల సదుపాయాలు ఉన్నాయి అన్నది ఎవరు??

ఎంత ఖర్చుకి అయినా వెనకాడనూ అన్నది ఎవరు?

కనీసం ప్రైమరీ కాంటాక్ట్ లు కూడా సేకరించకుండా విఫలం అయింది ఎవరు?

 

 

టెస్టులు చేస్తే ప్రైజ్లు ఇస్తారా అని నిర్లక్ష్యంగామాట్లాడిందిఎవరు ?

ఎవరికి కరోనా వచ్చినా గాంధీకి రావాలి అన్నది ఎవరు ?ఎమ్యెల్యేలకి వస్తే ప్రైవేట్ కి పరుగులు పెట్టింది ఎవరు? విలేఖర్లు ప్రశ్నలు అడిగితే కారెడ్డాలు చేసింది ఎవరు?

దేశమంతా టెస్టులు చేస్తుంటే నిమ్మకు నీరేత్తినట్లు ఉన్నది ఎవరు?

 

 

లక్ష మందికి ఐనా చికిత్స ఇప్పిస్తామ్ అన్నది ఎవరు ?

ధనిక రాష్ట్రం అన్నది ఎవరు? జీతాలు కోతలు పెట్టింది ఎవరు?

లెక్క పత్రం లేకుండా అన్నీ జోన్లూ గ్రీన్ జోన్లు అని ప్రకటించింది ఎవరు?

కరోనా ని జయించేసినమ్ అన్నట్లు ఊదర గొట్టింది ఎవరు?

 

 

 

దేశంలోకెల్లా టెస్టుల్లో వెనుక పడ్డది ఎవరు?

వచ్చింది ప్రపంచమంతా భయపడుతున్న ఒక ప్రాణాంతక వ్యాధి

పదవిలో ఉన్నందుకు భాద్యతతో వ్యవహరిస్తే మీ వెనకనే ఉంతుండే,జేజేలు కొడుతుండే

మాటలు కోటలు దాటుతాయి..చేతలు చెరువు గట్టు కూడా దాటాదు

టెస్టులు చేయండి... పోరాటం ఈ గడ్డలోనే ఉంది

అవతలోడు మోసం చేస్తేనే లడాయికి దిగినోళ్లమ్,

నమ్మి అధికారం ఇస్తే నెత్తి నేక్కి కూసుంటా అంటే బరాబర్ నిలదీస్తం"

 

మరింత సమాచారం తెలుసుకోండి: