ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో వైరస్ ఒక్కోచోట ఒక్కో రూపంలో ఉంది. తాజాగా ఏపీలోని కరోనాలో కొత్త కోణం బయటపడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏపీలో కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు గుర్తించిన కొన్ని గంటల్లోనే ప్రాణాలను హరించి వేస్తోందని తెలుస్తోంది. కరోనా వైరస్ కొత్త కోణం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. 
 
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. వైద్యులు ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో మరణాల సంఖ్య తక్కువగా ఉందని చెబుతున్నారు. అయితే వైరస్ గురించి తెలుస్తున్న కొత్త విషయాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా రోగులలో కొందరు అప్పటివరకూ ఆరోగ్యంగా ఉంటూ లక్షణాలు బయటపడిన కొన్ని గంటల్లోపే మృత్యువాత పడుతున్నారు. అప్పటివరకు కళ్ల ముందు ఆరోగ్యంగా తిరిగిన వ్యక్తులు క్షణాల వ్యవధిలోనే చనిపోతున్నారు. 
 
మృతి చెందిన వారికి పరీక్షలు నిర్వహిస్తే వారికి వైరస్ నిర్ధారణ అవుతోంది. తాజాగా విజయవాడ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు కరోనా భారీన పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఏఆర్టీ సెంటర్ లో పని చేసే వైద్యుడు శ్వాసకోశ ఇబ్బందులు మొదలైన కొన్ని గంటల్లోనే మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లాలో వందల మందికి కరోనా సోకడానికి కారణమైన వ్యక్తి సైతం ఇదే విధంగా మరణించాడు. 
 
ఆ వ్యక్తిలో లక్షణాలు బయటపడిన అరగంటలోనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈలోపే 300 మందికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు బయటపడేలోపే కొందరు రోగులు మృతి చెందుతుండటం ఏపీని వణికిస్తోంది. కరోనా లక్షణాలు కనిపించకపోయినా కొందరు వైరస్ బయటపడేలోపే మృత్యువాత పడుతున్నారు. గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, ఇతర వ్యాధుల భారీన పడినవారు ఎక్కువగా కరోనాతో మృతి చెందుతున్నట్టు తెలుస్తోంది.               

మరింత సమాచారం తెలుసుకోండి: