ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకున్న వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతుండటంతో అందరూ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ఎవ‌రికి వారు వ్యాక్సిన్ రెడీ చేస్తున్నామ‌ని చెపుతున్నా అవేవి కార్య‌రూపం దాల్చ‌డం లేదు. ఇప్ప‌టి వ‌రకు స‌క్సెస్ అయిన దాఖ‌లాలు లేవు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో 140 వ్యాక్సిన్లు అభివృద్ధి ద‌శ‌లో ఉండ‌గా.. వీటిలో 13 వ్యాక్సిన్లు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో ఉన్నాయి. 

 

ఇక ఎన్ని వ్యాక్సిన్లు రెడీ అవుతున్నా కూడా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా సంస్థ సంయుక్తంగా అభివృద్ది చేస్తున్న టీకా, మాడెర్నా సంస్థ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిలు మెరుగైన దశలో ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ సైతం ఇదే విష‌యాన్ని దృవీక‌రించ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందా ? అని దీనిపైనే కోటి ఆశ‌ల‌తో ఉన్నారు. ఈ వ్యాక్సిన్ కంప్లీట్‌గా రెడీ అయిన వెంట‌నే జ‌న‌వ‌రిలో 3 కోట్ల డోసులు త‌యారు చేస్తార‌ట‌. ఇందుకోసం బ్రెజిల్‌కు చెందిన కంపెనీతో 127 మిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఏడాది పాటు కరోనా నుంచి రక్షణ లభిస్తుంది.

 

యూఎస్ సంస్థ మాడెర్నా రూపొందిస్తున్న ఎంఆర్ఎన్ఏ-1273 టీకా రెండో దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికల్లా కోటి డోసుల వ్యాక్సిన్ తయారు చేసేందకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక థాయ్ లాండ్ కంపెనీ కూడా ఏడు వ్యాక్సిన్ల‌ను అభివృద్ధి చేస్తోంద‌ని.. వీటిలో అక్టోబ‌ర్ లో ఒక‌టి వ‌దులుతార‌ని స‌మాచారం. వైర‌స్ క‌ణంలోకి చేరినా దానిని విచ్ఛిన్నం చేయ‌కుండా ఉండేలా ఈ వ్యాక్సిన్లు రెడీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: