ప్రపంచ దేశాలు కరోనా వైరస్ పేరు వింటే గజగజా వణికిపోతున్నాయి. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోటికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ వల్ల వణికిపోతున్న తరుణంలో చైనా పరిశోధకులు మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. 
 
తాజాగా అక్కడి పరిశోధకులు కొత్త రకమైన స్వైన్ ఫ్లూను చైనాలో కనుగొన్నారు. జీ4 అని పిలవబడే వైరస్ హెచ్1.ఎన్1 జాతికి చెందినదని వారు చెబుతున్నారు. అమెరికా సైన్స్ జర్నల్ ఈ వైరస్ కు సంబంధించి ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ వైరస్‌ మానవులకు సోకే ప్రమాదం ఉందని... వైరస్ పై విసృతంగా పరిశోధనలు జరపాల్సి ఉందని వారు చెబుతున్నారు. ఈ వైరస్ ప్రమాదకరమైన అంటువ్యాధులను కలగజేస్తుందని వారు అంటున్నారు. 
 
మూడు ప్రత్యేకమైన జాతుల సమ్మేళనం ఈ వైరస్ అని... ఈ వైరస్ కు విరుగుడు లేదని చెబుతున్నారు. ఒకవేళ మనుషులకు సంక్రమిస్తే మిగతా ఫ్లూ వైరస్‌ల మాదిరిగా ఈ వైరస్ తగ్గదని.... ఇప్పటికే ఈ వైరస్ చైనా పందుల నుంచి మనుషులకు సంక్రమించిందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నామని.... మనుషులు అనుభవించే జ్వరం, దగ్గు, తుమ్ములు మాదిరి లక్షణాలే ఈ వైరస్ ద్వారా కలుగుతాయని వారు అంటున్నారు. 
 
అయితే ఈ వైరస్ చైనా సృష్టించిందా....? లేక జంతువుల నుంచి వ్యాప్తి చెందిందా.....? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరస్ మనుషుల నుంచి పందులకు పాకి వ్యాప్తి చెందుతోందా....? అని శాస్త్రవేత్తలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ పై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది. ఈ వైరస్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందితే మాత్రం చైనాకు శత్రు దేశాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: