సాధారణంగా ప్రతి ఎన్నికలు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంటాయి. కొన్ని అనివార్యకారణాల వల్ల మద్యంతర ఎన్నికలు వస్తుంటాయి. లేదా ఏక్కడైనా పదవిలో ఉన్న అభ్యర్థి కన్నుమూస్తే అక్కడ ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రతి సారి ఎన్నికల్లో  గెలిచిన వారే ఆ పదవిని అలంకరిస్తారు. అయితే  రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌  పుతిన్ పదవీ కాలం మరో నాలుగేళ్లు మిగిలిన ఉన్నప్పటికీ ఆయన తన పదవి కాలాన్ని పొడిగించుకునేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నాలు జరుపుతున్నారు. రష్యాకు 2036 వరకు తాను అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు చివరకు ఫలించాయి.  అక్కడి ప్రజలు ఆయన మరికొన్ని సంవత్సరాలు కొనసాగాలని కరుకుంటున్నారు.

 

2036 వరకు ఆయనే తమ దేశ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ప్రజలు ఆమోద ముద్ర వేశారు. ఇందు కోసం రాజ్యంగ సవరణకు వారు అంగీకరించారు. కొన్ని రోజులుగా రాజ్యాంగ సవరణ కోసం రష్యా ప్రజల అభిప్రాయాలను సేకరించే పనిలో ఉన్న ఆ దేశ ఎన్నికల సంఘం ఫలితాలు వెల్లడించింది. సుమారు 63 శాతం మంది ప్రజలు ఓట్లు వేయగా, అందులో 73 శాతం మంది పుతిన్‌కు సానుకూలంగా ఓట్లు వేసినట్లు ప్రకటించింది.  

 

అయితే ఈ ఓట్లు రిగ్గింగ్ జరిగిందని రాజకీయ వ్యాఖ్యాతలు ఆరోపించారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో 77.9 శాతం మంది రాజ్యాంగ సవరణకు అనుకూలంగా ఓటు వేయగా, 21.3 శాతం మంది వ్యతిరేకించారు. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు జరిగింది. పోలింగ్ 64 శాతం మించి జరిగింది. గత పదేళ్లలో పుతిన్‌కు అత్యధిక స్థాయిలో ఓటర్ల మద్దతు లభించిందని ఓట్ల సంఖ్య చెబుతోందని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: