తెలంగాణలో కరోనా హడలెత్తిస్తోంది.. వైరస్ దారుణంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య జోరు పెరిగిపోతోంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 1,892 కేసులు నమోదుకాడంతో జనం భయాందోళనలకు లోనవుతున్నారు. ఇక రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

 

 

ఒక్క రోజులోనే.. అత్యధికంగా 1,658 కేసులు హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. రోజురోజుకూ కేసుల సంఖ్యలో భారీగా పెరుగుదల నమోదు కావడంతో ఎక్కడ తాము కరోనా బారిన పడతామో అన్న భయం జనంలో పెరుగుతోంది. మరోవైపు మళ్లీ లాక్ డౌన్ పెడతారన్న వార్తలతో జనం ముందు జాగ్రత్తగా సరుకులు, నిత్యావసరాలు సిద్ధం చేసుకుంటున్నారు.

 

 

ఇక సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్‌లోనే కరోనా విజృంభిస్తుందన్న వార్తలు నగరవాసులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. సీఎం ఇంటి పరిస్థితే ఇలా ఉంటే.. తమ సంగతేంటన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఇక కరోనా లక్షణాలు ఉన్నవారి పరిస్థితి దయనీయంగా ఉంది. కరోనా వచ్చిందో లేదో తెలుసుకుందాని పరీక్ష కేంద్రాలకు వెళ్తే అక్కడ తమకు ఎక్కడ జబ్బు అంటుకుంటుందోనని భయపడుతున్నారు.

 

 

ఎంతగా కట్టడి చేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్నా.. కేసుల సంఖ్య పెరగడంతో జనం తమ వంతు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా సొంత గ్రామాలకు వెళ్లిపోతున్నారు. ఉద్యోగరీత్యా ఉన్నవారు, తప్పనిసరిగా ఉండాల్సిన వారు మాత్రం చేసేదేమీ లేఖ దేవుడిపై భారం వేసి.. తమ వంతు జాగ్రత్తలు తీసుకుంటూ విధులకు హాజరవుతున్నారు. అయితే మరణాల సంఖ్య ఎక్కువగా లేకపోవడం ఒక్కటే హైదరాబాద్ వాసులకు కాస్త ఊరటగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: