వైసీపీ పార్టీ లో ఇటీవల ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళ్లడం జరిగింది. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరు రాజ్యసభకు వెళ్లడంతో రెండు మంత్రి బెర్త్ లపై చాలామంది పార్టీలో ఉన్న నేతలు ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో… అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఈ రెండు మంత్రి పదవులు కట్టబెట్టే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం. దీంతో చాలా మంది వైసీపీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు… వైయస్ జగన్ ని మంచిగా చేసుకోవటానికి నానా ఫీట్లు చేస్తున్నారట.

 

ఇదే సమయంలో మంత్రి పుష్ప శ్రీవాణి అదేవిధంగా కృష్ణదాస్ ఈ ఇద్దరి మంత్రి పదవులు కూడా త్వరలో ఖాళీ అయ్యే అవకాశం ఉన్నట్లు వారి పనితనం నచ్చక జగన్ వారిని క్యాబినెట్ నుండి తప్పించడానికి చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా విశాఖపట్టణానికి చెందిన మినిస్టర్ అవంతి శ్రీనివాస్  పోస్ట్ కూడా ఊడి పోతున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. దీంతో మంత్రి పదవులపై చాలా మంది ఆశావహులు ఆశలు పెట్టుకోవటం తో పాటు ఎరకివారు వారు లెక్కలు లేసుకుంటున్నారు. కాగా స్థానిక ఎన్నికల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జగన్ పార్టీలో ఉన్న హైకమాండ్ నేతలకు సూచించారట.

 

పార్టీలో ఎక్కువగా మంత్రి పదవులపై ఆశిస్తున్న వారు తొందర పడుతున్న తరుణంలో మరోపక్క జూలై 22వ తారీఖున అన్నట్టుగా వార్తలు వస్తున్న తరుణంలో జగన్ పార్టీలో ఉన్న పెద్దలకు ఇప్పుడప్పుడే కాదు మొత్తం పనులన్నీ అయ్యాక లోకల్ ఎలక్షన్ లో ఏ నాయకుడు ఏ విధంగా పని చేశారు అన్న రీతిలో సర్వే జరిగాక రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపడతా అని  పార్టీ పెద్దలతో జగన్ డిస్కషన్ చేసినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: