ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 998 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. పాజిటివ్ కేసులలో ఏపీకి చెందిన వారు 961 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 36 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారించారు.    కరోనా కేసులు నానాటికీ పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజూ వందల్లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 20,567 శాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 998 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

 

ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక విదేశాల నుంచి వచ్చినవారిలో ఒకరు ఉన్నారు. ఇక జిల్లాలవారిగా నమోదైన కేసులను తీసుకుంటే.. అనంతపురంలో 87, చిత్తూరులో 74, ఈస్ట్‌ గోదావరిలో 118, గుంటూరులో 157, కడపలో 52, కృష్ణలో 62, కర్నూలులో 97, నెల్లూరులో 45, ప్రకాశంలో 27, విశాఖపట్నంలో 88, విజయనగరంలో 18, పశ్చిమ గోదావరిలో 40 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

 

తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,697కి పెరిగింది.  ఏపీలో ఇప్పటి వరకు 18,697 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 232 మంది మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: