ప్రపంచ మ‌హమ్మారి క‌రోనా రోజు రోజుకు పంజా విసురుతోంది. ఈ క్ర‌మంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ క‌రోనా కేసులు 20 వేలు క్రాస్ అవుతున్నాయి. స‌గ‌టున రెండు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వెయ్యికి చేరువ అవుతోంది. మ‌ర‌ణాలు కూడా రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. ప్ర‌జ‌లు సైతం ఎన్ని రోజులు బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఉంటామ‌న్న నిర్ల‌క్ష్యంతో ఉండ‌డం కూడా క‌రోనా వ్యాప్తికి కార‌ణ‌మ‌వుతోంది. ఇక ప్రభుత్వం కూడా టెస్టుల సంఖ్య పెంచుతోంది.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే చాలామందికి కరోనా పాజిటివ్ అని తేలినా వైరస్ లక్షణాలు కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు ఎంతో మందిని తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

 

క‌రోనా ల‌క్ష‌ణాలు ఏవీ బ‌య‌ట ప‌డ‌కుండానే చాలా మందికి వ్యాధి రావ‌డంతో పాటు లోపల ఉన్న శరీర భాగాలు అన్ని దెబ్బ తింటున్నాయి. చివ‌ర‌కు వారు మ‌ర‌ణిస్తున్నారు. ఈ ల‌క్ష‌ణాలు ఎక్కువుగా ఏపీ ప్ర‌జ‌ల్లోనే క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. లక్షణాలు కనిపించని వారికి ఇన్ఫెక్షన్‌ కారణంగా శరీర భాగాలేమైనా దెబ్బతినే అవకాశం ఉంద‌ని కూడా నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక శ్వాస‌కోస‌, కిడ్నీ, ఊపిరి తిత్తుల స‌మ‌స్య‌లు ఉన్న వారిపై క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని తెలుస్తోంది.

 

మ‌రి కొంద‌రికి మాత్రం డ‌యేరియా, తీవ్ర‌మైన జ్వ‌రం, ఒళ్లు నొప్పులు ఉన్నాయ‌ని అంటున్నారు. ఏదేమైనా ఏ మాత్రం అల‌స‌ట‌, జ్వ‌రం, ఒళ్లంతా నొప్పులు ఉన్నా కూడా ఎలాంటి నిర్ల‌క్ష్యం లేకుండా వెంట‌నే కోడిడ్ ప‌రీక్షలు చేయించుకోవాల‌ని నిపుణులు చెపుతున్నారు. ఏదేమైనా క‌రోనా విష‌యంలో ఎంత మాత్రం అజాగ్ర‌త్త ప‌నిచేయ‌ద‌ని ఈ ల‌క్ష‌ణాలు చెపుతున్నాయి.

  

మరింత సమాచారం తెలుసుకోండి: