బంజారాహిల్స్ లో శనివారం రాత్రి ఓ స్టార్ హోటల్లో రేవ్ పార్టీ జరిగింది . అయితే అది రేవ్ పార్టీ కాదని బర్త్డే పార్టీ మాత్రమేనని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లో బంజారా హిల్స్ లోని జరిగిన ఆ పార్టీ లో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేయడం, అందులో తెలంగాణకు చెందిన ఒక ముఖ్యమంత్రి అల్లుడు ఉండడం కలకలం రేపింది. అర్ధరాత్రి హోటల్ పై రైడ్  చేసి పోలీసులు నలుగురు అమ్మాయిల్ని, నలుగురు యువకులను అదుపు లోకి తీసుకున్నారు. ఉక్రేనియన్ కి చెందిన ఒక యువతి కూడా ఇందులో ఉంది . రాత్రి వేళ హంగామా చేస్తూ ఒక హోటల్ గదిని బుక్ చేసుకుని పార్టీని జరుపుతున్నారు.

 

బంజారాహిల్స్ పోలీసులకు ఇక్కడ రేవ్ పార్టీ జరుగుతోందని సమాచారం వచ్చింది. ఈ మేరకు అక్కడికి వెళ్లి పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన లో సంతోష్ రెడ్డి , రఘువీర్ రెడ్డి , భాను కిరణ్ విజయ రామారావు అలానే విదేశీ యువతి తో పాటు  మరో ముగ్గురు యువతులను అదుపు లోకి తీసుకున్నారు.

 

అయితే ఈ మహమ్మారి వల్ల సాగుతున్న ఈ లాక్ డౌన్  కారణంగా ఎక్సైజ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తుంచి, ఆయా చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. యువతులను మినహాయించి మిగిలిన వారిని రిమాండ్ కు తరలించారు . అయితే ఇది అందరూ అనుకున్నట్టు రేవు పార్టీ కాదని స్నేహితులంతా కలిసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకుంటూ ఉన్నట్లు విచారణ లో తేలింది. స్వయంగా బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు ఈ విషయాన్ని తెలియ జేశారు. అయితే ఇది రేవ్ పార్టీ మాత్రం కాదు స్నేహితుల తో జరుపుకున్న పుట్టిన రోజు పార్టీ అని ఆ విచారణ లో కూడా స్పష్టం అయ్యింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: