చాలా మందికి రోజు టీవీ చూడడం బాగా అలవాటు. ఎక్కువ సేపు టీవీ లోనే మునిగిపోతూ ఉంటారు. అలాంటప్పుడు చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. టీవీ చూస్తే సమయం గడిచిపోతుందని, బోర్ కొట్టదని ఎంతో మంది టీవీతో కాలక్షేపం చేస్తుంటారు. నచ్చిన ఛానెల్స్ ని చూస్తూ టీవీ లో నిమగ్నమై పోతారు. ఇది అంతా బాగానే ఉంటుంది కానీ దీని వల్ల వచ్చే సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది నేను చెప్తున్నది కాదు. పరిశోధన చేసి నిపుణులే చెప్పారు. అయితే టీవీ చూడటం మీకు అలవాటు ఉందా...?  టీవీ చూడడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మరి ఆ సమస్యలు ఏమిటో తెలుసుకోవాలంటే...?  ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి.

 

ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువ సమయం టీవీ చూస్తూ గడుపుతారు. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ వల్ల మరింత దగ్గరయ్యారు. ఎక్కువసేపు టీవీ చూడటం ఇంటర్నెట్ లో  వీడియోలు చూడటం అందరికీ అలవాటు అయిపోయింది. అయితే ఎక్కువ సేపు టీవీ చూడడం వల్ల ఏం జరుగుతుంది...? ఈ విషయానికి వస్తే ఈ విషయంపై పరీక్షించిన పరిశోధనలు కొన్ని విషయాలు చెప్పారు. అవేంటంటే వివిధ రకాల సమస్యలు కోరికలు ఉండి అవి తీరకపోతే అసంతృప్తితో ఉన్నవారు ఎక్కువగా టీవీ చూస్తారని శాస్త్రవేత్తలు చెప్పారు.

 

మేరీ ల్యాండ్  40 వేల మంది పై అధ్యయనం జరిపింది. ఈ నలభై వేల మందిపై అధ్యయనం చేసిన విషయాలు ఆసక్తి నిలిపాయి. అయితే తీవ్రంగా కోరిక ఉన్నవారు అది తీరక అసంతృప్తినిస్తే  దాని కారణంగా ఎక్కువగా టీవీ చూస్తారని ఈ సర్వేలో వెల్లడించింది. ఆనందంగా ఉన్న వాళ్ళు టీవీ చూసే సమయంతో పోల్చుకుంటే అసంతృప్తి పరులు 30 శాతం ఎక్కువగా రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తారని చెప్పిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: