చైనా భారత్ దేశాల మధ్య గత రెండు నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం అంతకంతకూ పెరగడంతో భారత్ భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. భారత్ రఫెల్ యుద్ధవిమానాలను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. 8 రఫెల్ యుద్ధవిమానాలు ఈ నెలలో భారత్ కు రాబోతున్నాయని సమాచారం. 
 
మరోఅవైపు భారత్ స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తోంది. ఏకే 47 బదులు ఏకే 202లను ఇక్కడే తయారు చేస్తోంది. ఎఫ్ 35 యుద్ధవిమానాలను కూడా అమెరికా తమ దగ్గర కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నా భారత్ మాత్రం వాటిని ఇక్కడే తయారు చేయాలని భావిస్తోంది. భారత్ యుద్ధవిమానాలను ఇతర దేశాలకు సంబంధించిన నిపుణులు తయారు చేసినా వాటిని భారత్ లోనే తయారు చేయాలని చెబుతోంది. 
 
అదే సమయంలో భారత్ దగ్గర ఉండే యుద్ధవిమానాల మోడల్ ప్రపంచంలో మరే దేశం దగ్గర ఉండకూడదని కోరుతోంది. అయితే ఎఫ్ 35కు సమానంగా ఉండే యుద్ధవిమానాలను సిద్ధం చేసి ఇస్తామని చెబుతోంది. భారత్ ఊ అంటే యుద్ధవిమానాలను అందించడానికి అమెరికా సిద్ధమవుతోంది. ఈ యుద్ధ విమానాల ద్వారా భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధమవుతోంది. 
 
మరోవైపు చైనా భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఇరు దేశాల సైనికులు 2కిలోమీటర్ల మేర వెనక్కు వెళ్లారు. అయితే గత అనుభవాల దృష్ట్యా భారత్ చైనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. చైనా సైనికులను నమ్మలేమని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. భారత్ తో వివాదం వల్ల ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న చైనా ఇప్పటికైనా బుద్ధిని మార్చుకుందో లేదో చూడాల్సి ఉంది.                    

మరింత సమాచారం తెలుసుకోండి: